పుట:Delhi-Darbaru.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

మైసూరురాజ్యము.


బిరుదు పేరుతో నచ్చట నివాసమేర్పఱచుకొని నేటికిని అనే కులచే నర్చన లందుచున్నది. అట్టి యా మహిషునికి చేరిన యూరగుటవలనను మహిష శబ్దము కన్నడమున మైసయని మారుటవలనను “మైసూరు' అయినది.

పురాతన నామము.

ఈ దేశమునకు ' మైసూరు ' అను పేరు పూర్వమునందు హిందూ వాజ్మయమున నెచ్చటను వాడబడియుండ లేదు. ఒక్క మహావంశమను బౌద్ధ గ్రంథమునందు మాత్రము మహిషమండ లమని ఈ ప్రదేశము పేర్కొనఁబడి యున్న దేగాని ఇతర గ్రంథము లందంతటను 'కర్నాటము', 'కర్నాటకము' అనుపదము లే ఉప యోగింపఁబడి యున్నవి. ఇప్పుడీ కర్నాటక పదము మైసూరు సీమకు బొత్తిగానన్వయింప కుండుటంబట్టియు అంతటితో నిలువక ‘కర్నాటక' 'కనర' శబ్దములు వేరు ప్రదేశముల కన్వయించు చుండుటం బట్టియు నీ పదముల నొక కొంత ఇట చర్చింపవలసి యున్నది. 'కర్నాట' కర్నాటక ' మను శబ్దముల కనేకులనేక యుత్పత్తులఁ జెప్పుచున్నారు. పండితులిద్దానిని సంస్కృత పద మనుచున్నారు.. సన్ వాటరు ఎలియట్ అను గ్రంథకర్త దీనికి “ శాతకర్ని ' * [1]మున్నగు పదములలోని 'క' (కర్ని' యను పద ములతో సంబంధము గలదనియు కావున నిది ప్రాచీన ప్రభువులు వలన వచ్చిన,, దనుచున్నాడు. మఱికొందడిది కర్ల + ఆట

.......................................................................................

  1. * వీరాంధ్రులు.