పుట:Delhi-Darbaru.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నామ: ప్రశంస..

283


పిలువఁబడుచున్నది... . మలనాడు . చిత్రవిచిత్రములగు నరణ్య ముల చేతను పర్వతముల చేతను గప్పఁబడియున్నది. మైదానము నీటివసతినిబట్టి యనేక విధములయి యున్నది. ఉత్తరముననుండు చదరమయిన నల్ల రేగడి భూమి ప్రత్తిని జొన్నలను ఈను చున్నది. నదులనుండి త్రవ్వఁబడిన కాలునల నీటి పారుదలగల దక్షిణణ -పశ్చిమభాగములు చెఱకునకును వరి పైరునకును సదన ములయి పరగుచున్న వి. చెఱువుల పై యా ధారపడి యుండు భూములు టెంకాయ పోకతోఁటలచే నలంక రింపఁబడియున్న వి. తూర్పుదిక్కునండలి-ఎఱ భూమిలో రాగి మున్నగు కుష్కీ పైరులు పండుచున్నవి. శిలామయమయిన - విరివియగు మధ్య ప్రదేశము ముదుకగడ్డి బయ లై అటనట చల్లని నీడనీను తోపు లఁ బ్రదర్శింపుచున్నది.

నామ ప్రసంశ.

సంస్థానమునకంతకును రాజధానింబట్టి మైసూరు అని పేరు. . మైసూరు అనునది.. మహిష - ఊరుఅను రెండుపదముల

  • కూడిక వలన నై.నది: 'మహిషుఁడను * [1]రక్కసుఁ డొక్కఁడా

ప్రాంతముల నుండెడువాఁడఁట. వానిని చాముండియను పేరఁ బరగు 'ఈశ్వర సతి ద్వంద్వయుద్ధమునఁ బరిమార్చి ఆ ప్రాంతము , లందలి జనులకు : సుఖముఁగూర్చి' మహిషాసుర. మర్దనియను ............................................................................................

  • విగ్రహములయందు మహిషుఁడు దున్నపోతు తలగలవాఁడుగఁ బ్రద ర్శింప బడుచున్నాఁడు.