పుట:Delhi-Darbaru.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

మైసూరు రాజ్యము


. సిద్ధము. ఈ దేశ మీ విధమున నడవులు పర్వతములు నదులు జలపాతములు దుర్గములు మున్నగువానిచే నలంక రింపఁబ.. యుండుటయేగాక భూగర్భ నిక్షిప్త వస్తు సంపత్తి చేతను, ఉత్తమ సస్య సంప్రాప్తి వలనను, అపూర్వ జంతుజాల సమా వేశంబునను వర్ణ నీయమయి యున్నది. భరతవర్షమునం దిం కెచ్చటను ఈసీమయం దుత్పత్తియగునంతటి బంగా రుత్పత్తియగుట లేదు. మంచి గందపు చెట్లకును భద్రేభములకును నిది పుట్టి నిల్లు. తేఁకుమ్రాకులును నిటమెండు. కొమ్ముగల పశువులును నిచ్చట వి శేషము. "కాఫీ పైరు నకుఁగూడ నిదియే పట్టు. ఈరీతి నిది ప్రకృతి ఫలముల విషయమున ప్రఖ్యాతము. ఇఁక నిచ్చటి మానవ చరిత్రమునకు దిరిగితిమేని శంకరాచార్యులును రామానుజులును నిరువురును దీని నె దమ జీవనముచే పావనము చేసిరి. ఇంతియగాక దక్షిణ హిందూస్థానమున పరాక్రమమునకుఁ బేరుగాంచి రాజ్యము లేలిన కదంబులకును హొయి సణులకును బహుశః విజయనగరాధి పతులకును నిదియె జన స్థానము.

రెండుభాగములు

ఇట్టి విశేష చరిత్రగల మైసూరు దేశమును స్వరూపము వలన రెండు భాగములుగ విభజింపవచ్చును. పడమటి కనుమల నను సరించు పర్వత ప్రదేశమగు పశ్చిమదిశాభాగమునకు మల నాడు అని పేరు. పట్టణములు పల్లెలును గలిగి జనసమృద్ధితో మెప్పు తూర్పు భాగము మైదానము లేక బయలు 'సీమయని .