పుట:Delhi-Darbaru.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స యా జి రా వు II.

257


చేసికొని 1839 లో 6 గుజరాతు క్రమవిరహితాశ్వకు " (Gujarat Irregular Cavalry) లను పేరిట నూతనముగ నొకపటాలము నేర్పఱచిరి.

ఇంతపనిజరిగిన వెనుక 1839నవంబరులో సయాజి రావు ఆంగ్లేయులకు పూర్ణ విధేయుఁడుగ నుందునని వాగ్దానము సేయుచు వారి శరణ మడిగెను. 1840 వ సంవత్సరమున ఒక్కొక్క విషయమునను సయాజిరావుతో రెసిడెంటు ఏర్పాటులొనర్చుకొనెను. వనిరాము దివానుపదమునుండి తొలఁగింపఁబడెను. సయాజీరావు మంత్రి లేకయె రేసి డెంటు గారి సలహాలతో,దానే స్వయముగ రాజ్యము నడపుకొన నిశ్చ యించుకొనెను. కాథియ వాడునందు గాయిక వాడునకుఁ జేరిన భాగమునందు న్యాయ పరిపాలనమునకు సంస్కారము లొనర్పఁ బడెను. బరోడా ప్రజలచే నష్టములందిన వారందఱకును దత్త దనుగుణముగ ధనమియ్యఁ బడియెను. తక్కిన విషయముల యందునుఁ దగిన కట్టుదిట్టము లేర్పఱుపఁబడెను. ఆంగ్లేయులు స్వాధీనము చేసికొని యుండిన నవ్సారి పెట్లాడు మండలములు సయాజి రావునకు మరల్పఁబడెను. అతఁడు ప్రజలను న్యాయ మార్గమున సంరక్షింతునని వాగ్దానము చేసెను. క్రొత్తంగ నేర్పడిన గుజరాతు క్రమవిరహిత ఆశ్విక సైన్యమునకయి కాథియ వాడు వరుంబడినుండి మూఁడులక్షలు ప్రతి సంవత్సరమును దీసి యుంచునట్లు నియమింపఁ బడెను.