పుట:Delhi-Darbaru.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

బరో డా రాష్ట్ర ము.


వతు పెట్టెను. మాకము మహాకఠిన పద్ధతులవలన నెఱ వేర్చ లేని పనులను గొంతవఱి కీరీతిని క్లేరు ప్రభువు దీర్చఁగలిగెను. కాని ఇంకను దురవస్థలు సయాజిరావుకుఁ ! దప్పినవి కావు. ఆతనియొద్ద మంత్రి పదమున కెక్కిన వనిరాముఁడు అతి దుర్గారుఁడయి ఆతనికి గొప్ప దలవంపులును ఇక్కట్టులును దెచ్చి పెట్టెను. వాఁడు స్వలాభ మే ప్రధానముగఁ 'జూచుకొనుట వలనను సయాజి మహా రాజు వానినే సంపూర్ణముగ 'విశ్వసిం చుట వలనను రాజ్యమరాజకమయి పోయెను. దొంగతనం ములు, ఖూనీలు, త్రోవ దోపిడులు మున్నగునవి మెండయ్యెను, విచారణ యను మాటయే సున్న యయ్యె. ఘరానామనుష్యు లకుఁ బ్రతుకు తెరువే లేదయ్యె. గాయిక వాడు ప్రజలో నొక్క భాగమగు భిల్లులు కోలు లను వారు నిర్భయులయి గ్రామము తరువాత గ్రామమును దగులఁ బెట్టుచుఁ గొల్ల కొట్టుకొన సాగిరి. గాయిక వాడు సైన్యము చేత చెడి దుర్మార్గముల నవలంబింపు చుండె. ఆంగ్లేయ ప్రభుత్వపు వారి సంరక్షణయుఁ బూచీకత్తును గల సాహు కారులను వనిరాముఁడును అతని యజమానియు దోచుకొనఁ జొచ్చిరి. వీని ననన్ని టిం గుణించి బొంబాయి ప్రభు త్వమువారును బంగాళములోని యాజమాన్య ప్రభుత్వము వారును పలుమారు పయాజీరావును గట్టిగ హెచ్చరించినను గార్యము లేకపోయెను. దానివలన. నాంగ్లేయ ప్రభుత్వము వారు నవ్సారిమండలమును పెట్లాడు మండలమును స్వాధీనము