పుట:Delhi-Darbaru.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

బరోడా రాష్ట్రము.


సేయ సమయము కాదయ్యెను. బరోడాయందు ఫతేసింగు గూడ స్వాతంత్ర్యత సంపాదింపఁ బ్రయత్నించు చున్నట్లగుపడెను. కావున నాంగ్లేయ ప్రభుత్వము వారు పీష్వా బాజీరావును గొంత భయ పెట్టి ట్రింబక్టీని దమ స్వాధీనము చేసి వేయునట్లొనర్చి గాయిక వాడుకు సంబంధించిన విషయములను గుఱించి 1817న సంవత్సరములో సంధికియ్య కొనునట్లు" చేసిరి. ఆసంధినలన పీష్వా గాయిక వాడు పైఁ దనకుఁ గల సర్వాధికారములను మాను కొనియెను. ఆదివఱకు గాయికవాడుపై దనకుండిన హక్కులకు గాను సంవత్సరమునకు నాలుగులక్షల రూపాయీ లతోతృప్తి పొందనియ్యకొని అహమ్మదాబాదును గాయిక వాడునకు సంవత్సరమునకు 42 లక్షలకు గుత్తకునిచ్చెను. ఈ యొడంబడిక ననుసరించి గాయిక వాడునకును ఆంగ్లే యులకును మఱియొక సంధిజరిగెను, దానివలన గాయిక వాడు సాహాయ్య సైన్యముల సంఖ్య మునుపటికంటెను హెచ్చించ బడెను. ఆ హెచ్చు సంఖ్యను పోషించుటకొఱకు పీష్వాభాగము లను గుజరాతునందు గాయిక వాడు గుత్తకు తీసికొనుట వలన నాతనికి వచ్చుచుండిన వరుంబడి యంతయును నాంగ్లేయులకు మరల్పఁ బడెను. ఇంతియ కాక ,గాయిక వాడునకు ఆంగ్లేయుల కును ఎక్కుడు సౌకర్యముగ నుండునట్లు వారి రాష్ట్రములలోని కొన్ని కొన్ని భూఖండములను బరస్పరము మార్చుకొనిరి.