పుట:Delhi-Darbaru.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

హైదరాబాదు సంస్థానము


భారము లెవ్వియును దాము మోపుట లేదని కూడ వాగ్దానము' చేసిరి. నైజామునకు సంవత్సరమునకు 6,26,375 రూపాయలు ఆదాయము నిచ్చ భూ భాగము ఈసంధివలనఁ జేరెను. రాజా చందూలాల్ గట్టివాఁడేగాని యతని రాజ్యాంగ పద్ధతులు మాత్రము పురాతనములు. జనులపై వేయఁబడిన పన్ను తప్పక బొక్కసము చేరుటయే పరమావధిగఁ గల "వాఁడు గావున నతఁడు ఏలములు వైచి ఈయీభాగమున కి తింతయని నిర్ణయించుకొని ఆయా భాగములలోఁ బన్ను నసూలు చేసికొనుటకు కౌలుదారులను వదలుచువచ్చెను. యజమాని కియ్యవలసినది పోఁగా ఎంతదొరికిన నంత రాబట్టుకొనుట కౌలుదారుని పని కావున నీపద్ధతి బహుస్వల్ప కాలములోనె యసంతుష్టిని గలిగించి దుగ్గతులను దెచ్చి పెట్టెను. పన్ను లిచ్చు ప్రజలు కౌలుదారుల యధికారుల యొక్క దురాగతములకు నిలువ లేక త్రోవదోపుడులకును దిరుగుబాటులకును మొద లిడిరి.అన్యాయవర్తులగు కౌలుదారుల పక్షమువహించి దుర దృష్టులును . సుస్వభావులును నగుఁ బౌరుల పైకి దాడి వెడలి సై న్యాధికారులయిన ఆంగ్లేయులు వారల నన్యాయముగ నురుమాడవలసిన వారైరి.

రాజ్యాంగ సంస్కారము.

ఇట్లు చందూలాల్ రాజనీతివలస దేశమునందు దుస్థితి ప్రబలుట సహింపలేక 1820వ సంవత్సరమున సర్ చార్లస్ 'మెట్ .