పుట:Delhi-Darbaru.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

హైదరాబాదు సంస్థానము.


మగు వివాదము జరిగెను. “సర్వాధికారియగు సంరక్షుకుడును మూర్ఖుఁడగు సంరక్షితుఁడును బెనఁగులాడిన సర్వసామాన్యముగ నెట్టి ఫలము గలుగున దియు మన మెఱింగిన విషయమేగదా. నై జాము దనసంరక్షుకులకు ముత్తెముల నిచ్చి చిప్పను దానుంచు కొనెను. మూనిన్ -ఉల్-ముల్క్ అను నైజాముగారి మను ష్యుఁడు నామకార్థము ముఖ్యమంత్రిగి సేమింపఁ బడియెను. ఆంగ్లేయులకు మిత్రుఁడగు రాజాచందూలాల్ అను హిందువు పేరునకు పేష్కా రేయయినను నిజమునకు పేష్కారుదివానుల[1] శక్తుల రెంటిని గలవాఁడుగ నొనర్పఁబడెను. "2 [2]ఇతఁడు 1832 వ సంవత్సరమున మూనిక్-ఉల్-ముల్క్ చనిపోవుట తోడనే దివానుపట్టమును గూడ ధరించెను.

చందూలాల్ ముఖ్య మంత్రిత్వము.

మొదట నితఁడు సుంకమువసూలు చేయు శాఖలో సర్కారు నౌకరుగఁ జేరిన వాడు. 1804 న సంవత్సరమున మీర్ ఆలమ్ ముఖ్యమంత్రి యగుటతోడన్ అతఁ డీతనిని తన వద్ద కార్యనిర్వాహకుఁడుగ నుంచుకొనెను. అతఁ డాంగ్లేయులకు మిత్రుఁడై వారిపక్షము సవలంబించుచు వచ్చినందున నితనికిని ఆంగ్లేయులయెడ స్నేహభావము పెరుగుచు నే వచ్చెను. దాని వలన నితనికిఁ గలిగిన లాభము మాచదువరులిదిఱకే వినియు

............................................................................................ 1

2

  1. దివాను, ముఖ్యమంత్రి యనునవి పర్యాయ పదములనిగ్రహించునది..
  2. జి. బి. మాలిక.