పుట:Delhi-Darbaru.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైజాము స్థితి.

147


ఆసంవత్సరమున మీర్ . ఆలమ్ మరణమందుట తోడనె మరల నైజూమునకును రెసిడెంటునకును ముఖ్యమంత్రిపదమున కెవ్వ రిని నియమించవలె ననుట వాదము ప్రారంభమాయెను. 1800 సంవత్సరమున జరిగిన సంధి ప్రకారము నైజాము దన స్వంత సైన్యమును అవసరమగుడు ఆంగ్లేయుల సాహాయ్యర్థము పంపవలసిన వాఁడయియుండెను. మహారాష్ట్ర యుద్ధమున నిట్టి సైన్యమును దగినంతను దగినస్థితిలో బంపకపోవుటయేగాక తరు వాతఁ బలుమారు హెచ్చరింపఁ బడినను సరియగు సైన్యమును చేర్చుటకూడ మాని వేసెనఁట. సికందరుజా మహారాష్ట్రుల యెడ పక్ష పాతము గనుపఱచు చుండినందున సతఁడు ఆంగ్లేయులకు విరోధియని ప్రకటించిన బాగుగనుండునాయని మార్విసు వెల్లస్లీ మొదటి మహా రాష్ట్ర విగ్రహమునకుఁ బ్రారంభమున యోజించినట్లు గూడఁ దెలియవచ్చుచున్నది.[1] మీర్ ఆలమ్ ను ముఖ్యమంత్రిగ నేర్పఱచు కొనుట కితఁడెన్ని విధములఁ బెనగు లాడినదియును రెసిడెంటుగారికిఁ దెలిసియే యుండెను. ఇట్టి దర్భముల నీతని ముఖ్యమంత్రి స్థానమున దనచే నియమింపఁబడి తన పై ఆధారపడియుండు వాఁ డుండుట యావశ్యకమని రెసిడెంటుకుఁ దోఁచెనని వేరుగ వ్రాయఁబని లేదు. కావున నతఁ డు దన యిస్ట ప్రకారమే ముఖ్యమంత్రిని నియమింప వలసిన దని నైజామును నిర్బంధ పెట్టెను.దాని పై నిరువురకును గొంతతీక్ష్ణ, .............................................................................

1

  1. Wellington's despatches. .