పుట:Delhi-Darbaru.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేయి మండు:

131


రూపాయిల ద్రవ్యమును మహా రాష్ట్రుల కచ్చుకొని తన ముఖ్య మంత్రిని ( hostage.) ప్రతిభునిగా నిచ్చి వారినుండి తప్పించు కొనవలసిన వాఁడాయెను.

ఇట్లపజయముంది రాజధాని వచ్చి చేరెను. ఫ్రెంచిపటా లము లొక వైపునను ఆంగ్లేయపటాలములు.మఱియొక వైపునను ఇతనిని గొలుచుచుండెను. భరతవర్షమున పెంచివారి యౌన్న త్యము 1757వ సంవత్సరముతోడనె నశించిపోయి యుండెను. కావున "ఫెంచిదొరతనమువారికి సేవకులుగ నది వఱకుండినవా రచ్చటచ్చట స్వదేశీయ ప్రభువుల దగ్గఱచేరి పొట్టఁబోసికొను చుండిరి. అట్టివారలలో నిప్పుడు నైజాము కడనుండిన రేయిమం డొక్కరుఁడు.

రేయిమండు.*[1]

ఇతఁ డసామాన్య శక్తియుతుఁ డనుటకు సందియ ము లేదు. ఇతఁడు ఫ్రాంసు దేశమున 'గాస్కనీ' పరగణాలో ' సెరిన్యాక్ ' అను గ్రామములో ' 1755 వ సంవత్సరమున జననమందెను. ఇరువది సంవత్సరముల ప్రాయ మప్పుడు హైదరాలీకిఁ దోడయివచ్చిన " షెవలియర్' డిలాషి' యొక్క పటాలములో " నెక - చిన్న' యధికారిగఁ జేరెను. అనేక పర్యాయము లితడు ధైర్యసాహసములు ' సూపుటనలన నధి .....................................................................................................

  • ఇతనిని ఇప్పటికిని హైదరాబాదు నందు గొప్పకుటుంబములవారు స్మరించుచున్నారు.