పుట:Delhi-Darbaru.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

హైదరాబాదు సంస్థానము.


సమకట్టెను. కాని యతనికి బుద్ధి బలము దక్కువ కావున దండ్రిచే నతనినిబట్ట నియోగింపఁబడిన ఫ్రెంచివారలకు లోబడి పోయె. ఇట్టి సందర్భములఁ దనకు సాహాయ్య కారులుగ నుండి తాను దనసీమనువదలి దండులతోఁగూడ బయట యుద్ధముల యందు నిమగ్నుఁడయి యుండఁ దనరాజ్యములో నల్ల కల్లోల ములు జరుగకుండఁ గాచుటకు సిద్ధమయియున్న ఆంగ్లేయుల పటాలములను దిరుగఁగొట్టుట తగదని తలంచి కాఁబోలు వై జాము వారిని మరల రప్పించెను. వారును ఆలీజా లోఁబడునంతలో వచ్చి చేరిరి. ఆలీజాను ముఖ్యమంత్రి యవమాన పెట్టి నందున నతఁడు విషము దీసికొని మృతినొందెను.

నైజాము తాను చేర్చిన ఫ్రెంచి సైన్యములతో మహా రాష్ట్రుల నెదిర్చెను. 'రేయిమండు సిద్ధపజచిన పటాలము లప్పటి కాలమునకు మిక్కిలి బలవంతములు. భరత వర్షము నందు మఱి యే స్వదేశాధీశుని యెడను నట్టిబలము లుండ లేదనిన వానియుత్కృష్టత బయల్పడఁగలదు, నైజామునకును మహా రాష్ట్రులకును జరిగిన యుద్ధమునందు నైజామును అతని పనికిమాలిన పటాలములును వెనుకంజ వైచి పారిపోవకున్నచో రేయిమండు సంపూర్ణ జయమంది యుండును. కాని నైజామే అప్పటి విజయమును జెడిపికొనెను. మహారాష్ట్రులతనిని కర్ డ్లా దుర్గమునఁ జుట్టు కొనిరి, ఆతఁడు సంవత్సరమునకు ముప్పదియైదు లక్షలా అదాయమునీను భూభాగమును నాలుగున్నర కోటి