పుట:Delhi-Darbaru.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లేయులతో సంధి (1768).

121


గాక నైజాము పైఁ గర్నాటకమునందలి పాళేగారులు కొందఱు తిరుగఁబడిరి.. వారినణఁచుట యందును నతఁడాంగ్లేయుల నుప యోగించుకొన వలసినవాఁడె యాయెను. ఇట్లు వారిని దోడుఁ జేసికొని యతఁడు దనపాళేగారులను సాధించినదేగాక. హైదా రాలీకి లోబడిపోయి యుండిన బెంగుళూరు కోటను గూడ స్వాధీన పఱచుకొన గలిగెను. కాని యీలోపుగ హైదరు నైజా మల్లని దనవలలోఁ జిక్కించుకొని ఆతనిని ఆంగ్లేయులనుండి విడదీసి వారిని ఈ దేశమునుండి సంపూర్ణముగఁ బారదోలుటకుఁ బ్రయత్నములు సల్పెను. ఇప్పగిది "మొదటికే మోసము వచ్చి నందున నాంగ్లేయులు దమ యింటిని దాము కాచుకొన వలసి వచ్చెను. -హైదరు మహారాష్ట్రులతోడను నైజాముతోడను జేరి వీరిని సమయింపఁ జూచెను. హైదరు నైజాముల సైన్య ములు కర్నాటక ముపయి దండెత్తివచ్చి ఆంగ్లేయులు నై'జాము సాహాయ్యముగఁ బంపుచుండిన బలమును దాఁకెను. మొదట నాంగ్లేయులు వెనుదీయవలసిన వారైనను దరువాత వీరి యుద్ధ భటుల శక్తి ప్రదర్శనమువలనను వీరికి గవర్నరు జనరులుగ నుండిన హేస్టింగ్సు యొక్క చాతుర్యమువలనను, నైజా: పోరాటము తగదని తెలిసికొని మరల వీరిపక్షమును జేరెను.

ఆంగ్లేయులతో సంధి. (1768),

అప్పుడు 1768వ సంవత్సరమున నాంగ్లేయులకును నై జామలీకిని రెండవసంధి జరిగెను. దీనివలన నైజాము చే