పుట:Delhi-Darbaru.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూ ర్వ చరిత్ర.

105


స్థాపించిరి. క్రీ|| శ | 608 మొదలు 642 వఱకును రెండవ పులి కేశి యనువాడు ఇంచుమించుగ నర్మదానదికి దక్షిణమున నుండు ద్వీపకల్పమునంతయు 'నేలెను. ఈపగిది మహాబలవంతు- లయి చాళుక్యులు రాజ్య మేలి నంతకాలమును వారికిని పల్లవు లకును, నిడువరాని యుద్ధము జరుగుచు నేయుండెను. కావున చాళుక్యులు దక్షిణహిందూస్థానములో విశేషభాగ మేలు చుండినను వారి రాజ్య పరిమితి మాత్రము క్షణకుణమును మారుచుండెను. చాళుక్యులను గొంతకాలమునకుఁ దరువాత రాష్ట్రకూటులు లోబఱు చుకొనిరి గాని, మఱల చాళుక్యులు క్రీ! శ|| 978 లో నధికారమునకు వచ్చి రెండు శతాబ్దములు చోళ రాజులతోడను, ద్వార సముద్ర రాజులతోడను హో రా హెరిగఁ బోరుచుఁ దమపదవిని నిలుపుకొనిరి. 1189 వ సంన త్సరప్రాంతమున చాళుక్య బల మస్తమించెను. యాదవులును హెూయిసలలును బ్రభుత్వమున కెక్కి డి.యాదవుల రాజధాని దేవగిరి యయ్యెను. దక్కనున నధికారము వహించిన హిందూ వంశములలో యాదవవంశము కడపటిది. విజయనగర సామ్రా జ్యము దరువాత ప్రతి స్థాపింపఁ బడెనుగాని దాని యధికార మంతయు కృష్ణకు దక్షిణ భాగమున నె వ్యాపించి యుండుటం బట్టి దక్కనున గడపటి హిందూ సంతతి రాజులు యాదవు లే యనుటలో నేమియు దప్పుండదు.