పుట:Delhi-Darbaru.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

హైద రాబాదు సంస్థాన ము.


గను రాంధ్రులు. అశోకుని శాసనములలో వీరి పేరు గానవచ్చు చున్నధి.1[1] గాని వీరుబలవంతులయినది క్రీII పూ!! 220 వ సంవ త్సర ప్రాంతములనె. కృష్ణా డెల్టాలో నుండి తమ యధికారము ను క్రమక్రమముగ వర్తింపఁ జేయుచు వీరుదమసామ్రాజ్యమును నాసికము వఱకును వ్యాపింపఁ జేసిరి. క్రీస్తుశకము మొదటి శతాబ్దమునకు వీరు శాక్యులకును, పల్లవులకును,మాళవఘూర్జర ములలో నివసించుచుండిన యవనులకును, బ్రతిస్పర్థులుగను పించుచున్నారు. క్రీ! శ॥ 188 లో రెండవ పులమాయి రాజ్య మునకు వచ్చెను. అతఁడు పశ్చిమ క్షేత్రపుఁడగు రుద్రదమనుని బిడ్డను పెండ్లాడెను. మామగారితో పోరుటలో రెండవపులు మాయి తన రాజ్యములోఁ బశ్చిమభాగమును 'గోలుపోయెను. మఱియొక శతాబ్దములోపల నాంధ్రసంతతియే యంతరించెను. అందులకుఁ గారణము బహుశః పల్లవరాజుల ప్రవృద్ధియే యై యుండును. వీరు మొదట కృష్ణా నదికి దక్షిణ భాగమున రాజ్య మేలుచుండి, మెల్లమెల్లగ హైదరాబాదు ప్రాంతముల వఱకును వ్యాపించిరి. ఆంధ్రులకు తరువాత హైదరాబాదు సంస్థాన ముండు భూప్రదేశము నేలిననారిలో సుప్రసిద్ధులు చాళుక్యులు. వీరు క్రీ. శ. 550 ప్రాంతమున విజాపురము జిల్లాలోఁ గాను పించి, పూర్వ పశ్చిమ దిగ్భాగములకుఁ దమ యధికారమును వ్యాపింప జేసి, కల్యాణి రాజధాని చేసికొని రాజ్యమును

......................................................................................

1.

  1. అశోకుని శిలాశాసనము. 18