పుట:Delhi-Darbaru.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

హైద రా బా దు సంస్థానము

దే వ గి రి దుర్గము.



"దక్షిణాపథము మీదికి దృష్టి సారించిన మహమ్మదీయ ప్రభువులలో మొదటివాఁడు అల్లాయుద్దీను. అతఁడు 1295 వ సంవత్సరమున, ఫెరిస్తావ్రాతల ననుసరించి, యాప్రదేశమున కంతయు. రాజయి పరిపాలించుచుండిన యాదవవంశజుఁడగు రామ దేవుని పైకి దాడి వెడలెను.ఇతని రాజధాని దేవగిరి. అల్లా యుద్దీను దేవగిరినిగొల్లకొట్టెను. ఇట్లు ప్రారంభమయిన మహమ్మదీయ దిగ్విజయము దేవగిరిలో నిలువ లేదు. క్రమక్రమముగ దక్షిణాత్య రాజు లెల్రును మహమ్మదీయులకు లోఁబడవలసిన వా రైరి 1325 లో మహమదు తుగ్లకు నధి కారము క్రిందికి దక్ష్ ణాపధమంతయు వచ్చి చేరి యుండెను. కాని యతని క్రౌర్యము వలన యాతని సామ్రాజ్యమునకు ముప్పువాటిల్లెను. అతఁడు