పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుకరి, వాడుకరి చర్చ పేజీలు

ఖాతా తెరచుట
కీబోర్డు నమూనా ఎంపిక
వాడుకరి ఆదేశాల వరుస
వాడుకరి పేజీ సృష్టించునప్పుడు కనబడే సందేశం
వాడుకరి పేజీ

ఖాతా తెరచునప్పుడు వచ్చే పెట్టెలో చేర్చవలసిన వివరాల బొమ్మ చూడండి. దీనిలో వాడుకరి పేరుని ఆంగ్లంలో వుంచుకోవటం (సంతకం తెలుగులో కనబడేటట్లు తరువాత అభిరుచులలో అమరిక ద్వారా చేసుకోవచ్చు) , ఈమెయిల్ చేర్చటం మంచిది. ఖాతా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా చేయటం లేదని నిర్ధారించటానికి కేప్చా అనగా వ్యక్తి మాత్రమే సులభంగా అర్ధం చేసుకోగల బొమ్మలోని అక్షరాలు సంబంధిత పెట్టెలో చేర్చాలని గమనించండి.

ఆ తరువాత భాష అమరికలలో మీకు కావలసిన కీబోర్డు నమూనా (ఆంగ్ల టైపు అనుభవమున్న వారికి లిప్యంతరీకరణ సులభంగా వుంటుంది.) ఎంపిక చేసిన కీబోర్డు నమూనాకు, ఆంగ్లకీబోర్డుకు కంట్రోల్+M వాడి మారవచ్చు. మీరిప్పటికే కంప్యూటర్ లో తెలుగు కీ బోర్డు వాడుతుంటే అదే కొనసాగించవచ్చు. మరింత సమాచారానికి దగ్గరిదారి WP:TH చూడండి.

వికీపీడియాలో వ్యాసాలే కాక ఇతర పేజీలు కూడా ఉంటాయి. మీరొకసారి దిద్దుబాట్లు ప్రారంభించిన తరువాత ఇతర సభ్యులు మీ గురించి కొంత తెలుసుకోవడానికి, మీరు మీ వాడుకరి పేజీ తయారు చేసుకోవాలనుకోవచ్చు. పుట పైభాగంలో కుడి వైపున (ఒకవేళ మీరు ప్రవేశించి ఉంటే) మీరు, మీ వాడుకరి పేరును చూడవచ్చు. మీ పేరుపై నొక్కి మీ వాడుకరి పేజీ చేరుకోవచ్చు. మీరు మీ వాడుకరి పేజీని సృష్టించుకోని పక్షంలో మీ పేరు నీలి రంగుకు బదులుగా ఎర్ర రంగులో కనిపిస్తుంది.


ఇంకా సృష్టించక పోతే మీ వాడుకరిపేజీ ఖాళీగా కనబడుతుంది. మీ గురించి మీరు ఇష్టపడినంత (కొద్దిగా కాని,ఎక్కువ కాని) తెలియజేయడానికి సరైన ప్రదేశం ఇది మాత్రమే. మీ ఆసక్తులు, మీకు సంబంధించిన ఇతరవివరాలు ఇందులో వ్రాయవచ్చు. మీరు పేజీని భద్రపరచగానే మీ పేరు నీలిరంగుకు మారుతుంది.


మీతో ఇతరులు చర్చిండానికి అనువుగా మీకు ఒక చర్చా పేజి ఉంటుంది. దీనిలో ఇతర సభ్యులు మీకు సందేశాలివ్వవచ్చు. ఒకవేళ మీరు ఇతర సభ్యులతో సంప్రదించాలని అనుకుంటే వారి చర్చా పేజీలో ఒక సందేశం వ్రాయండి. మీరు చర్చా పేజీలో మీ సందేశం తరువాత తప్పక సంతకం చేయాలి. సవరణ పెట్టెలో వికీ సంతకం చేయడానికి ఉపకరించే చిహ్నం ను గమనించండి. మీరు ఈ బటన్ నొక్కినటైతే (~~~~) ఇలా వరుసగా నాలుగు టిల్డేలు చేర్చబడతాయి. భద్రపరచితే సందేశం తరువాత మీ పేరు, తేదీ మరియు సమయం (అంతర్జాతీయ ప్రామాణిక కాలమానం) కనబడుతుంది.

గమనిక: వ్యాసానికి సంబంధించిన చర్చలు ఆ వ్యాస చర్చా పేజీలోనే చేస్తూ, సంబంధిత సహ సభ్యుల వాడుకరి పేజీలకు లింకులివ్వడం ద్వారా వారికి ఎకో వ్యవస్థ ద్వారా సందేశాలు చేరే విధానం వాడుకొనుట మంచి పద్ధతి. వాడుకరి చర్చ పేజీలలో ఒక్కవాడుకరికి మాత్రమే సంబంధించిన విషయాలు చర్చించటం, చర్చ అంతా ఒకే చోట వుండడానికి చర్చ ప్రారంభించిన పేజీలో స్పందన వ్రాసి, ఎవరికైతే స్పందన రాస్తున్నారో వారి వాడుకరి పేజీని స్పందనలో లింకుగా చేర్చటం మంచి పద్ధతి.