పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సముదాయంతో సంప్రదింపులు

ప్రతి పేజీకి అనుబంధంగా ఒక చర్చాపేజీ వున్నది. ఈ చర్చాపేజీని, అభిప్రాయాలు ప్రకటించుటకు, కొత్త వనరులను సూచించుటకు, సమస్యలను ఉదహరించుటకు, సభ్యులకు అంగీకారం కాని మార్పుల గురించి చర్చించుటకు వాడవచ్చు.

వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్యలో సహ సభ్యునికి సందేశం పంపటానికి వారి వాడుకరి పేజీ కి లింకు ఇవ్వడం
వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్య (పై చిత్రంలో సవరణ కనబడేతీరు)
సూచనల వ్యవస్థ తెరపట్టు

ఒక ముఖ్యమైన మార్గదర్శకం ఏమంటే, వికీపీడియా సముదాయ చర్చలలో గౌరవపూర్వకంగా మరియు మర్యాదతో వ్యవహరించాలి. ఒకవేళ మీరు ఒక విషయం పట్ల విభేదించే పక్షంలో, మీలాగే సహ సభ్యులు వికీపీడియా లక్ష్యానికి కట్టుబడి మంచి ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నారని అనుకోవాలి. చర్చలలో సభ్యుని వ్యక్తిత్వంపై కాక చర్చావిషయం పట్ల ప్రాధాన్యత చూపండి.

చూడండి! కొత్త సందేశం! ఎవరైనా మీ వాడుకరి పేరుని పేర్కొన్నప్పుడు, మీ సవరణకు కృతజ్ఞతలు తెలిపినప్పుడు, లేక మీ వాడుకరి చర్చా పేజీలో సందేశం చేర్చినప్పడు సందేశాల హెచ్చరిక ఎర్రరంగులో కనబడుతుంది. దీనిని నొక్కినపుడు సూచనల పెట్టె తెరచుకొని సూచనలు చూడవచ్చు.