పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ బొమ్మ లో నవ్వుల బుల్లోడు చేర్చిన విషయం వాడిన వికీకోడ్(మార్కప్) కనబడుతుంది.

వ్యాస సవరణ చిత్రం

ఈ మెట్లు వాడి మీరు వికీపీడియా వ్యాసానికి విషయం చేర్చవచ్చు.

మెట్టు 1: మీరు అదనపు సమాచారం ద్వారా విస్తరించటానికి ఆసక్తి ఉన్న వ్యాసాన్ని ఎంచుకోండి.

మెట్టు 2: ప్రస్తుత వికీపీడియా వ్యాసం కంటే ఎక్కువగా వివరమున్న విశ్వసనీయమైన మూలాన్ని వెతకండి. దీనికి అంతర్జాలం శోధనా యంత్రం, స్థానిక గ్రంథాలయాలు, ఆంగ్ల భాషలో వ్యాసం(వున్నట్లైతే) మూలాలు ఉపయోగపడవచ్చు.2

మెట్టు 3: ఇప్పడు మొదలవుతుంది తమాషా భాగం. సవరించు అన్న బటన్ నొక్కండి! 3

మెట్టు 4: ఇప్పటికే లేని వివరాలను చేర్చండి. మీరు తెలుసుకున్న వనరులనుండి వ్యాసంలో చేర్చాలనుకున్న సమాచారాన్ని సంగ్రహరూపంలో మీ స్వంతపదాలకూర్పుతో చేర్చండి. 4

మెట్టు 5: మీరు కొత్తగా చేర్చిన పాఠ్య భాగానికి చివరలో, ఆధారమైన మూలపు వివరాన్ని చేర్చండి. సవరణ పనిముట్ల పట్టీ లో (వికీమార్కప్ లేక విజువల్ ఎడిటర్) మూలము అనే బొమ్మని నొక్కుటద్వారా మూలం వివరాన్ని చేర్చవచ్చు. శాశ్వతంగా వుండే అంతర్జాల వనరులైతే చిరునామా(URL)తో పాటు శీర్షిక, పరిశీలించిన తేదికూడా చేర్చండి. దినపత్రికలలో ప్రచురించే ప్రముఖ విషయాలైతే పత్రిక పేరు,ప్రచురణ తేది, సంచిక, శీర్షిక వివరాలు చేర్చాలి 5

మెట్టు 6: " సారాంశం" క్రింద ఉన్న పెట్టెలో మీ సవరణకు శీర్షిక వ్రాయండి. దీనిలో సమాచారం చేర్చినప్పడు '+’, తొలగించినప్పుడు ’ -’ వాడడం సాంప్రదాయం. దిద్దుబాటు సారాంశం సహాయంతో, ఇతర సభ్యులు మీరు చేసిన దిద్దుబాటు గురించి సులభంగా తెలుసుకుంటారు.6. (విజువల్ ఎడిటర్ అయితే భద్రపరచు (మెట్టు 7 చూడండి) నొక్కిన తరువాత సారాంశం చేర్చాలి)

మెట్టు 7:ఇప్పుడిక భద్రపరిచే సమయం ఆసన్నమైనట్లే. పేజీని భద్రపరచు బటన్ నొక్కండి. (వికీమార్కప్)

ఒకవేళ పై అంశాలు చేసే క్రమంలో పొరపాటు ఏదైనా జరిగితే ఆందోళన పడకండి. తరువాత మీరు అదనపు దిద్దుబాట్లతో వాటిని సరిదిద్దవచ్చు లేకుంటే వ్యాసాన్ని పూర్వపు స్థితికి తీసుకురావచ్చు.