పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168చిన్ననాటి ముచ్చట్లు

లుగా, వీధిభాగవతములు ముదుగై వచన నాటకములు వెలసినవి. 1884లో గుంటూరునాటక సంఘమువారీ వచన నాటకములాడుటలో ప్రసిద్దులు. 1888లో వీరినిచూచి మా వంగవోలువారైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు, రాజమహేంద్రవరమున ఏర్పరచిన హిందూనాటక సమాజమువారు 1889లో ఆడిన తోలేటి వెంకటసుబ్బారావుగారి 'హరిశ్చంద్రనాటకము'న్నూ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి 'కీచకవధ’ యున్నూ ఇట్టి వచననాటకములే. ఈ వచన నాటకములలో శ్రీప్రకాశం పంతులుగారు చిన్నతనములో చంద్రమతి, ద్రౌపది పాత్రలు ధరించు చుండిరి. శ్రీ ఆచార్యులవారు ఆంగ్లవిద్యాభ్యాసమొనర్చిన పట్టభద్రులు, న్యాయవాదులనైయుండిరి. ఆంగ్ల నాటకముల సారమును, సంస్కృత నాటకముల పోబడులు నెరింగిన ప్రోడలగుట తమ స్వతంత్ర నాటకములలో నాయా ఛాయల చూపించిరి. ధార్వాడకంపెనీ పార్శీ కంపెనీలవారి దరువులు, మెట్లు మున్నగునవి అప్పటికే ఆంధ్రదేశమందలి ప్రేక్షకుల నాకర్షించుచుండుటచే - వానికి సమమైన పాటలను తమ నాటకముల చేర్చిరి. నాటకమున పాత్రధారణమును వృత్తిగాగాక వినోదముగా వహించు పెద్ద మనుష్యులను చేరదీసి - నాటకసమాజమును నిర్మించిరి. వీరి మేనల్లుడే విఖ్యాతి చెందిన నాట్యకళాప్రపూర్ణ రాఘవాచారిగారు. శ్రీ ఆచార్యులవారు "చిత్రనళీయము" నందు బాహుక పాత్రను నటించుటను నేను చూచియున్నాను. వారు వ్రాసిన నాటకములు పైకి వచ్చిన పిదప అంతకుపూర్వము నాటకములన్నియు మాయమైనవి.

బళ్లారిలోనే వకీలుగానుండిన శ్రీ కోలాచలం శ్రీనివాసరావు పంతులుగారు కూడ ఆ కాలముననే కొన్ని నాటకములు వ్రాసిరి. వీరు వ్రాసిన నాటకములలో మేటి 'విజయనగర సామ్రాజ్య పతనము'. ఈ నాటకమందు పఠాన్ రుస్తుం పాత్రధారిగా శ్రీరాఘవాచారిగారి ఖ్యాతి వేరుగా చెప్పనక్కరలేదు.