పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

చాటుపద్యరత్నాకరము

బోతరా జింటికి వచ్చెను; బావమఱఁదిని క్షేమసమాచారము లడిగెను. కాని శ్రీనాథుఁడు చెప్పీచెప్పనట్లు చెప్పెను. ఈతఁ డెప్పుడును బోతరాజు నెగతాళిఁ జేయుచుండెడివాఁడు. నాఁ డట్టి ప్రసంగ మేమియు రాలేదు. నిష్కళంకహృదయుఁ డగు పోతనామాత్యుఁ డాతనియొద్దనున్న గ్రంథముం జూచి ‘యది యేమి పుస్తక’మని యడిగెను. ఆతఁడు, ‘బావా, నీవు తెలిఁగించినసంగతి తెలియక నైషధమును నేనుగూడ తెలిఁగించితిని. ఈగ్రంథ మదియే.’ పోతన: ‘బావగారూ! తమరు నైషధమును దెలిగించుట నీరీతిగా వెల్లడించుచున్నారా? లేక నన్ను బరిహాసము చేయుచున్నారా?’ శ్రీనాథుఁడు: ‘సరే, ఇఁక నెన్నినాళ్ళు దాఁచెదవు? నీ వబద్ధ మాడవనుకొంటిని. నే డంతయు బయలుపడెను.’ పోతన రిచ్చవడి, ‘ఏమిది? నేను నిశ్చయముగా నాగ్రంథమును దెలిగించియుఁ దనకుఁ జెప్పక దాఁచిపెట్టితినని నొక్కి పలుకుచున్నాడు. నిక్క మెఱుంగవలయు’నని తలఁచి ‘శ్రీనాథకవీ! యీసంగతి నీకెవరైనఁ జెప్పిరా? లేక నీవే కలగంటివా’ యనెను. అంతట తన కీసంగతినంతయు మల్లన చెప్పెననియు పద్యమునుగూడ వినిపించెననియుఁ జెప్పి పైపద్యమును జదివెను. మల్లన నవ్వుకొనుచు నటనుండి లేచిపోయెను. పరమభాగవతశిఖామణి యగు పోతనామాత్యుఁడు నిజముఁ గుర్తెఱిఁగి చిఱునవ్వు నవ్వి ‘కవిసార్వభౌమా! యీపద్యమును నేను వ్రాసితినని, నీయల్లుఁడు చెప్పుటకంటె, నీయల్లుఁడు చెప్పుటకంటె, నీవు నమ్ముటయందు మిగులసారస్యము కలదు. ఇట్టి రసభంగకవిత్వమును నాకెందు కంటఁగట్టెదవు. అది మామలల్లుండ్రగు మీ యిరువురకే తగుఁగాక’