పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

57

యనెనఁట. శ్రీనాథుఁడు తనతెలివితక్కువ బయటఁబడుటకు విచారపడి యల్లుఁడు చేసిన మోసము నెఱుఁగఁజాలమికి సిగ్గిలి బావగారివలనఁ గలిగిన యవమానముచే మ్రగ్గెను. అప్పుడే యింటికి పోవలయునని యత్నించియు నట్లు వెళ్ళిపోవుట మిగుల యవివేకమగునని యెంచి, యాపూట నిలిచి సాయంతనమున వెళ్ళిపోయెనఁట.

కూచిమంచి తిమ్మకవి

ఈతఁడు రసికజనమనోభిరామమను రచించిన రసికవతంసుఁడు. ఒకవేశ్య యితనిరసికతకు మిగులసంతసించి, తిమ్మకవితో నెప్పుడు సంభాషింపఁ దటస్థింతునా యని చింతించుచుండెనఁట. ఆవేశ్య కవితారచనయందును గడుజాణయఁట. కాకున్న నిట్టితలఁపు కలుగఁబోవునా? తిమ్మకవి యొకానొకనాఁడు వీథినిఁ బోవుచుండెను. (ఆతనిసౌందర్య మంత ప్రశంసనీయము కాదని వాడుక.) ఆసమయమున నావేశ్య హఠాత్తుగా నామార్గమునఁ దిమ్మకవిఁ జూచి, యింతకన్నను మంచిసమయము తటస్థింపదని తలంచి మించినసంతోషమున నాతనిఁ గౌఁగిలించుకొనెనఁట. తిమ్మకవి నివ్వెఱపడి, పెడమోముఁ బెట్టెనఁట. అప్పు డవ్వేశ్య

చ. ‘చతురులలోన నీవు కడుజాణ వటంచును నేను కౌఁగిలిం
   చితి నిట్లు మాఱుమే మిడఁగఁ జెల్లునె?’