పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

చాటుపద్యరత్నాకరము

   స్వామికార్యములందు జాడ్యంబు లెన్నిన
               మన్నీలముఖములఁ దన్నినాఁడు
   యితనిసమ మెన్న జగతిలో నెవ్వ రీడు
   ఉదయగిరిదుర్గసంరక్షణోన్నతుండు
   నయగుణోదారచిన్నమల్లయకుమార
   కంబనికిఁ బోల్ప దాతలు గలరె ధరణి?

క. కోటికిఁ బెట్టినయన్నము
   పూటనె జీర్ణించుఁ గీర్తి పోదు ధరిత్రిన్
   నాటుకొని కఱవు నిలువదు
   మాటయొకటె నిలుచుఁ జిన్నమల్లయకంబా!

దామర వేంకటపతి


క. శ్రీదామరవరవేంకట
   భూదారక! రూపభాగ్యభోగావనముల్
   శ్రీదామరవరవేంకట
   భూదారక నిన్నుఁ గాక పొందునె యొరులన్.

వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడు

ఈకమ్మప్రభువు మహాదాత. పదునేడవశతాబ్దిలో దెలుఁగుదేశమునఁ గొంతభాగమును బాలించినవాఁడు. ఈతని రాజధాని కృష్ణాతీరముననున్న యమరావతి. ఆకాలములోఁ బచ్చెపువాండ్రను నొకజాతివాండ్రు దారిదోఁపుడుగాండ్రయి జనులను మిగుల బాధించుచుండిరి. వారిలో ననేకులను వేంక