పుట:Chanpuramayanam018866mbp.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71

చతుర్థాశ్వాసము


దడయిడలేమి గైకొనియెఁ దగ్గతి నింకఁ గళంకు లేక నీ
కుడిభుజపీఠికి న్మరలు కొన్నది పంటవలంతి నావుడున్.

89


క.

కేకయజోక్తి మయూరీ, కేక యహిం గలంచువీఁకఁ గీలితపరితా
పాకృతిఁ బూన్ప వివేకా, పాకృతి ధృతిసడలి యడలి భరతుఁడు పలికెన్.

90


శా.

కైకా యెంతటి పాతకంబు ఫలమోకా తల్లి వై తీ వికఁన్
మాకు న్నల్గుర కన్నదమ్ములకు నంబాత్వంబు నీయం దనం
గీకార్యం బగు నింతనుండియును దుష్కీర్తిప్రసూభావమే
చేకో నర్హవు నీకుఁ బట్టి ననుకో సిగ్గయ్యెడి న్నామదిన్.

91


క.

మాతృవ్యాజము గాంచిన, పాతకధోరణి వటంచు భరితక్రోధుం
డై తన్ముఖమున కభిముఖ, మై తగుదృష్టి న్మరల్చి యనుజున కనియెన్.

92


గీ.

మనుకులంబుఁ గాల్తు నని కంకణము గట్టు, కొన్నయట్టి చెట్ల కొఱవి యుండ
సవనభరణ కేళి భువనపావనకీలి, నాశ్రయాశసంజ్ఞ యగడుగాదె.

93


శా.

హల్యన్మోచి కొమాళ్లు దున్నఁగఁ దదీయశ్రాంతి యెంతో మన
శ్శల్యం బై కనిపింప లంపటపడె న్సంతానబాహుళ్యమాం
గల్యం బొందియు వేల్పుటా వనఁగ నింకం బుత్త్రశోకంబు కౌ
సల్యాదేవికి నేకపుత్త్రకుఁ దరించన్ శక్యమా యక్కటా!

94


చ.

తనవిధిచే నరేంద్రుఁ డవితర్కితమంత్రగతి న్వసింప నా
తని యసువాయువు ల్వరముధారసనాద్వయిఁ గ్రోలి యున్నదీ
ఘనకుటిలస్వభావ యిది గట్టును జెట్టును బుట్ట మిట్ట యుం
డిన వని కింతె గాని తగునే జను లుండెడు రాజధానికిన్.

95


గీ.

ఆత్మవృత్తి కర్హ మగుదైత్యకులము లె, న్నేని యుండఁ గేకయేశునింట
లెస్సపుట్టె నీపె లేమావిగుమినట్ట, నడుమ విసపుఁదీఁగె పొడమినట్లు.

96


క.

జననీతి కెడయు మామక, జననీతిగ్మత నయంబు సౌజన్యంబుం
జననోఁచితి నిఁక మనుకుల, జననోచితకీర్తి యేల సంధిలు ననుచున్.

97


చ.

అనుజునితోడఁ గైకనగ రాతఁడు వెల్వడి కోసలేంద్రనం
దనఁ గని మ్రొక్కి పెక్కుశపథంబుల రామవనాప్తి కాత్మఁ దా
ననుమతి చెందమిం దెలిపి యంత గురూదితసూత్రపద్ధతిన్
జనకున కాహితాగ్న్యుచితసంస్క్రియల న్నెఱవేర్చె నన్నిటిన్.

98