పుట:Chanpuramayanam018866mbp.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

చంపూరామాయణము


క.

జనకుం డీగతిఁ బితృవన, మునకుం జన భ్రాతృవనసముత్సుకుఁ డగు న
య్యనఘుఁడు జననీముఖహిత, జనములతో మరలి వచ్చె సదనంబునకున్.

99


వ.

వచ్చి యంత యథావిధిసమాహితౌర్ధ్వదైహికచతుర్దశదినుం డగుచు నాఘనుం డున్నయెడ జలజహిత కులహితాచరణ జాగరూకం బగుపౌరలోకంబు సప్రధానానీకంబై మకుటభరణార్థంబు తన్నుం బ్రార్థింప నప్పార్థివతనూజుం డిట్లనియె.

100


శా.

చాలింపుం డిది యేటిమాట యకటా సౌమిత్రి చారిత్రమే
నాలంబించుట కోపలేక భవదీయాజ్ఞప్తిఁ గోటీరము
న్మౌళిం బూనక యుందునే యొదవి యున్నం బర్ణశాలావకా
శాలంభం బిఁక దండకావిపినసాలాంతర్విశాలావనన్.

101


చ.

అని వనయాత్రఁ దెల్పె నతఁ డంతిపురంబున కేగి యచ్చటన్
జననయనాసుఖప్రరత సత్పథపాంసులతావహత్వముం
డనకుటిలత్వముం దలఁచిన న్సుడిగాలిని బోలు మందరం
గని యనుజుండు చంపఁ జనఁగా విడిపించిన రాముతల్లికిన్.

102


వ.

ఇట్లు తెలిపి యద్దేవి మొదలైన జననీజనంబు వెంబడింప నగరంబు వెల్వడి యనల్చశిల్పికల్పితసమీకృతసమాచీన కాననపథంబు వట్టి ఘోట్టాణవారణఘటావీరభటశతాంగసంఘసంఘాతభూతలోదితపరాగయోగపంకిలనభోవిటంకరింఖ ఝ్ఝురీపరీవాహుండును సుమంత్రమంత్రిమణి ఫణితగుణనివహగుహసహాయతానిస్తరిత భాగీరథీపురస్సరసరిద్వ్యూహుండును నై ముందట భరద్వాజు నాశ్రమద్వారంబునందుఁ బరివారంబు డించి యాతనిం గతిపయసమన్వితుం డగుచుఁ బొడగాంచి యావిరించిప్రభావుం డమేయనిజయోగమాయాబలానీయమాన సంతానకామధేనువైమానికచకోరలోచనా సమాచారితోదాత్త తత్తజ్జనోచిత నిమజ్జనానులేపనాభరణభోజనాది బహువిధోపచార గౌరవతృణీకృతశచీసహచరత్రిదివపదనైపథ్యం బైన యాతిథ్యంబు సలుపం బొలు పెసంగుసేనతో నాఁ డచట నుండి మఱునాఁడు తన్మౌని యనుప ననుసమచిరత్న రత్నవిచిత్రకూటం బగు చిత్రకూటంబు డగ్గఱి యగ్గిరియుపత్యకావకాశంబునందు సేనానివేశంబునుంచి చెంచుఱేఁడునుం దానును