పుట:Chanpuramayanam018866mbp.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70
చంపూరామాయణము


గీ.

హరి యనఁడు తేరు వెదకఁడు కరినిఁ గోర, డేనిమిత్తంబు వినువీటిపైన మితని
కనఁగ నరిగె నభంగురాహవవిహార, విశకలితదైత్యరథుఁడగు దశరథుండు.

83


ఉ.

అత్తఱి దృగ్ఘనోదయత నశ్రుఝరంబులు గండమండలిన్
హత్తి కుచాద్రులం దొరసి నాభిసరంబులు నిండి పో నెలుం
గెత్తి నిశాంతచంద్రముఖు లేడ్చి రమర్త్యనతోదరీకరో
ద్యత్తరకిన్నరీముఖరితాహరితానవితానమాధురిన్.

84


ఉ.

సూనృతవాది రా జనెనుసుద్దులు నిమ్మళమాయెఁ గైకసం
స్థాన మటంచుఁ దిట్లు రుదితంబులు గానకు రాఘవుండు పోఁ
గా నిపు డింత పుట్టెఁ గడగం డ్లనువార్తలు మిన్ను ముట్టి బి
ట్టై నగ రెల్ల గొల్లు మన నాగత మయ్యెఁ బ్రభాత మంతటన్.

85


క.

భరతాగమపర్యంతము, ధరణీపాలకుని మేనుఁ దైలద్రోణిం
దొరయింపఁ తత్ప్రధానుల, నరుంధతీప్రాణబంధుఁ డాజ్ఞాపించెన్.

86


గీ.

అర్హ మాయెఁ గృతాధ్వరుం డైనయతని, దేహము తిలోత్తమోదితస్నేహమునకు
నర్హము గదా కృతాధ్వరుం డైనయతని, దేహము తిలోత్తమోదితస్నేహమునకు.

87


భరతుఁ డయోధ్యకు వచ్చుట

వ.

అంతట ననుక్తపంక్తిరథవిరామవారతానీతభరతు లగుటకు వసిష్ఠుచే ననుజ్ఞాతు లైన దూత లతిపవనజవనయవనహాయసంకోచితసరణులై తురగపతినగరి కరిగి దుస్వప్నదూయమానుం డైన కైకయీసూనునకు గురునిదేశంబు విన్నవింప నాతని మాతామహుండును యుధాజిత్తుండు ననుపం గతిపయదినంబుల నపశకునసంపాతసాతంకచేతస్కుం డగుచు దుర్దినంబుకరణి నస్ఫురద్దివంబై వీరభటజనంబుగతి నసీతాసహాయఖేలనం బై నిదాఘసమయసరసిజాకరంబువైఖరి ననూర్మిళాపాన్వితం బైనసాకేతంబు సొచ్చి, యచ్చొటు యథాపురప్రచారచారుపౌరంబు గామికి విచారంబు దోఁప భూపతియగారంబు దరిసి యరసి యం దెవ్వరిం గానక మగిడి జనని నగరి కరిగి మాత కానతుం డై తండ్రిసేమం బడుగఁ బరుషతరవావదూక యగుకైక యి ట్లనియె.

88


చ.

అడవికిఁ దండ్రిపంపువడి యాలును దమ్ముఁడుఁ దానుఁ జెంచుకై
వడిఁ జనినాఁడు రాముఁడు భవద్గురుఁ డంతటఁ గాలధర్మముం