పుట:Chanpuramayanam018866mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

చంపూరామాయణము


దిర వగు నిన్నుఁ జూచి వనదేవత లాత్మనిమేషకల్పనా
పరిహృతి కొగ్గినాఁ డనుచుఁ బంకజగర్భునిఁ దిట్టకుందురే.

62


వ.

అని యనుఝ్ఝితానపాయవాత్సల్య యగుకౌసల్యకు సుశీలచారిత్ర యగుసుమిత్రకుఁ ద్రిలోకీహితాచరణకార్మణవరోత్సేక యగుకైకకు విశకలితమనోరథుం డగుదశరథునకు ననవరతనిష్టాగరిష్టుం డగువసిష్ఠునకుఁ బ్రయాణోచితప్రదక్షిణయుతప్రణామంబు లాచరించి కాంచనమయం బగునిశాంతంబు వెలువడి నివార్యమాణానుసారిదౌవారికవితానుం డగుచు జానకీసౌమిత్రియుక్తంబుగా నమేయగుణసముద్రుం డగు రామభద్రుండు తండ్రియానతి సుమంత్రుండు మున్కొని హజారంబు చాయ కాయితం బొనర్చి తెచ్చిన మరుచ్చటులజవనిరాఘాటఘోటకానుషంగం బగుశతాంగంబు నుత్తుంగరంగసానుశృంగంబు నారోహించు చంచలామణిధనురుదారధారాధరంబు డంబు మెఱయ నెక్కి యొక్కటం గ్రిక్కిఱిసి గుమురుగుము రై వెంబడించు నాగరకసముదయంబు పదరయంబువలన నుదయంబుఁ జెందు పెందూళి మైథిలీజాని [1]లేనియారాజధాని విడుచుపుడమి వడువునం దొడరి సీత యడవికై నడచు నెడ నిది యమంగళం బనుచుఁ దత్ప్రజానయనజాలకీలితానల్పబాష్పపూరంబు దూరంబు గావింప సాంతఃపురంబుగాఁ బురంబును వినిర్గమించి యొక్కించుక తడవునకుఁ దనరథం బతీతలోచనపథం బగుటయు వగం బొగిలి మూర్ఛిల్లి పరిజనానీతశిశిరోపచారగౌరవానీతచేతనుం డై తనూజుండు పురికి మరలి కోసలకుమారికాగారంబు చేరి వర్తింప నిటు నివారింప రానిమానవపరంపరల సందడుల మందమందగమనుం డై చనిచని వికసదరివిందసందోహశోణిమాళీకలో చక్షురాలోక దూరీతకృతావగాహిదేహి మోహసంతమస యగు తమస డాసి వాసరకరుండు తనదువనరాశి జిగమిష ననుకగింపక యపరవనరాశి గదియు పగిది నస్తమించుటయుఁ దత్తటినీతటతరుతటాంచలాస్తీర్ణపర్ణశయనాయతనరీతి నుల్లంబు పల్లవింపంజేయ నెల్లవారు శయనించురాతిరి నిశీధసమయంబున నమాత్యు నాలోకించి వంచితజనప్రపంచవేగసంచారచారు వగు తేరు దోలించి వేగాసాదిత వేదశ్రుతిగోమతినిషందికాహ్వయనదీత్రయాలంకృతియు నిక్ష్వాకునకు మనువితీర్ణియు నగువసుమతిం గడచి జాహ్నవీసముద్వేలకల్లోల మాలికాను

  1. మైథిలీజానియైనదావేని—యని మాతృక