పుట:Chanpuramayanam018866mbp.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
65
చతుర్థాశ్వాసము


ఉ.

వెండియు రాఘవుండు పృథివీపరిణీమణియింటికి న్సుమం
త్రుండు నిజాగతిం దెలిపి తోడ్కొనిపోఁ జని యూర్మిళాసహా
యుండు విదేహరాజసుతయున్ వనికిం దనవెంటఁ బైనమై
యుండుట విన్నవింప విపినోన్ముఖుఁ డయ్యె నతండు నయ్యెడన్.

53


క.

చింతిలి సుమంత్రుఁ డాజగ, జంతం గైకేయిఁ జూచి సడలందగదే
యింతట నభిషేకనిదా, ఘాంతావగ్రహము నీదురాగ్రహ మింతీ.

54


సుమంత్రుఁడు కైకను నిందించుట

చ.

మును పొకనాఁడు ఱేఁడు తనమ్రోలఁ బిపీలిక లాడుముచ్చటల్
విని నగ, నవ్వఁ గారణము వేఁడ నతం డది చెప్పినప్పుడే
తనువు దొఱుంగుఁ బ్రాణ మనఁ దన్మృతికిన్ మతినొప్పుకొన్నదు
ర్జననికిఁ బుట్టినట్టియతిసాహసురాలవు గావె నావుడున్.

55


క.

అసమంజు వెడలనడిచిన, వసుధేశ్వరుఁ డేజనాపవాదముఁ జెందెన్
దెస లెఱిఁగిన వరములకా, ముసగసలని కైక నోరుమూయించెఁ బతిన్.

56


క.

సరయూపాతితపౌరో, త్కరుఁ డౌయసమంజురీతి దాశరథి యిఁకన్
బురి వెడలుట కెంతటి ము,ష్కర వని సిద్ధార్థకుండు కైకం బలికెన్.

57


చ.

వనికి గురూక్తిఁ దోఁచుపరివారఫుబొంద పయి న్నిరీహుఁడై
తనపినతల్లియానతిని దాల్చెఁ గటిస్థలి రాఘవుఁ డధి
స్తనతటనానటజ్జనకజానయనాంబుఝరాభిషేకసం
జనితదుకూలతాగుణవిశాలము వల్కలచేల మత్తఱిన్.

58


క.

వల్కలధృతి నజగవహృతి, శుల్కాత్తకళత్రుఁ డతఁడు సుషమవహింపన్
నూల్కొనె జసముఖబిసకిం, జల్కతతిన్ వికృతి నిఖిలజగదద్భుతమై.

59


మ.

అనఘుల్ గన్గొననోఁచు రాఘవునియాథాత్మ్యంబు భావించులీ
ల నధోవల్కలదర్శనాసహనిమీలన్నేత్రుఁడై మున్ను గ
ట్టినహొంబట్టు సడల్ప నేమికొద వుట్టెన్ గోటికందర్పమో
హనునెమ్మేని కటంచు వాక్పతిసుతుం డార్తిన్ మరల్చెన్ మతిన్.

60


క.

కులగురువారితనిజవ, ల్కలధృతియై యపుడు సీత కౌసల్యపదం
మ్ముల కెరఁగి వనికి సెలవిడఁ, దెలుపన్ మది నడలి యాసతీమణి పల్కున్.

61


చ.

ఖరకిరణాతపోత్కరనఖంపచజాగ్రదరణ్యమార్గసం
చరణములన్ నిమీశకులజాత నవావతరారవిందమం