పుట:Chanpuramayanam018866mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

67


వేలశీతలవిశాలమూలంబుగను నదూరమందాకినీసలిలశీకరాసారతోషితానేకశాఖాశిఖానిరంతరకులాయవిశ్రాంతబహువిధశకుంతవారంబును నభంగశృంగిబేరనగరశృంగారంబును నగుహింగుదీపాదపంబుచాయ నిరవుకొని యున్న సమయంబున.

63


గుహుఁడు రాముం జూడవచ్చుట

మ.

జనిసాహస్రతపఃఫలం బితని సాక్షాత్కార మీస్వామి కై
క నిదేశింప వనిం జరింపఁ జను టాకర్ణింప శక్యంబె కా
దని తాదాత్వికమోదఖేదగుణశీతాశీతనేత్రాంబు లా
ననము న్నింప గుహుండు రాఘవునకు న్వందారుఁ డై యిట్లనున్.

64


మ.

భటదుర్గోద్భటదుర్గవజ్జనపదప్రాజ్యంబు నారాజ్య మె
ప్పటికి న్నీది గదా చతుర్దశసమాపర్యంతముం దేవ రి
చ్చొటనే యుండి నను న్భవచ్చరణదాసుం బ్రోవరాదా మరు
త్తటినీసేవ జనన్యదర్శనమనస్తాపంబుఁ బాప న్నృపా.

65


శా.

[1]నామందాధిపుఁ డాదరింపఁదగు నన్నన్ రాఘవుం డంబకు
న్నే ము న్నిచ్చినమాటపట్టు సడల న్లెస్సా! యిఁక న్వల్కలం
బేమే నొందుటగాక రాచసొగసు ల్వెట్టంగ నర్హంబె యే
లామిథ్య ల్మనువంశ్యులం దనుడుఁ బల్కంగొంకె వాఁ డంతటన్.

66


సీ.

హరులపగ్గము లూడ్చి యంబువు ల్గ్రోలించి సారథి దరితరుచ్ఛాయ నిలుప
మధుపర్క మిడురీతి మకరందబృందమందరగంధవహుడు ముందఱ మెలంగ
వనవాసభృతనిజవ్యథ జూడలేక డాఁగినరీతి నపరాద్రి నినుఁడు గ్రుంకఁ
దనతోని సాంధ్యవందన మొనర్చినమునీంద్రులగోష్ఠి నిశఁ గొంతప్రొద్దు జరగ


గీ.

ధనువు చేఁబూని భిల్లుండు దవుల నుండ, లక్ష్మణుఁడు నిద్ర సౌవిదల్లత భజింప
జానకియుఁ దాను గాంగరోధోనికుంజ, పర్ణమయశయ్య రఘుపతి పవ్వళించె.

67


క.

మఱునాఁ డరుణోదయమున, భరితజటాభారుఁ డగుచు భాగీరథి ది
వ్యరథానుగ యగు నిమ్నగ, దరి నిలిచి రఘూద్వహుండు ధరణిజ కనియెన్.

68


సీ.

కంజాతవిమతశేఖరజట్టాకోటీరకౌబేరవారిజాకరమరాళి
ప్రకృతికైతవగవీభరితశివాలయక్షితిధరోధక్షరక్షీరలహరి
కపిలకోపజ్వరగ్లపితసాగరసముద్ధృతనవ్యదివ్యౌషధీమతల్లి
జాతుమజ్జనకృజ్జనాతిపాతకజాతదద్దురీసందోహదందశూకి

  1. ప్రత్యంతరము లేక సవరింపలేదు.