పుట:Chanpuramayanam018866mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

చంపూరామాయణము


గీ.

ఆహరిద్వారవార్ధిపర్యంతచార, జటిహితనిమిత్తవిధికృతస్ఫటికరథ్య
యగు నిది శరణ్య కృష్ణవేణ్యాదిసింధు, జలజదృగ్జాలమూర్ధన్యజహ్నుకన్య.

69


మ.

అని మంత్రిం బురికి న్మరల్చి తరిచే నామింటిమున్నీటి జ
వ్వనిదాఁటించి గుహుండు వీడుకొని పోవన్ మత్స్యదేశంబుత్రో
వ ననేకావను లెల్లఁ జూచుచు భరద్వాజాశ్రమక్షోణికిం
జని యాతం డనుపం బ్లవోత్తరితభాస్వన్నందనావారి యై.

70


సుమంత్రుఁడు శూన్యరథంబుతో నయోధ్యకు వచ్చుట

చ.

చనిచని కాంచె దాశరథి సానుఝరీతటజాతచూతచం
దనలతికాదిపాదపవితానకృతానిశఖేలనామిళ
జ్ఞానతతిగీతివిశ్రుతివిశంకటపంకజరాగధోరణీ
కనదరుణీకృతిద్విగుణగైరికఝాటము చిత్రకూటమున్.


ఉ.

కాంచి వసించి దైవతశిఖామణి కోకిలకంఠకాహళీ
పంచమనాదపంచశరపాటహమౌఖరి లక్ష్మణప్రయ
త్నాంచితలోచనోత్సవదళాలయచాతురిఁ జెంత సీతవ
ర్తించుకతంబున న్నిజపురీవిహృతి న్మఱపించె నంతటన్.

72


వ.

అంతట సుమంత్రుండు కాంతారవైరస్యంబున రఘువతంసంబు మరలునో యనుదురాశం జేసి యాశృంగిబేరనగరంబున గుహసకాశంబునం దొన్ని వాసరంబు లుండి వేసరి కతిపయప్రయాణంబులఁ బరీక్షీణోత్సవప్రజాసమేతం బగుసాకేతంబు సొచ్చి దాశరథివిరహిత నిజసమాగమసంజాత శోకాతిరేక నాగరకలోక బహువిధాక్రందమందీభవన్నేమినిస్వనతరంగం బగుశతాంగంబు డిగ్గి నగరు సొచ్చి యచ్చట మహీపతికి నతి యొనర్చినఁ దనవిారఘుపతిసమాగతిం దిరోభూతచేతనుం డగుచు నతండు కోసలసుతాసుమిత్రాసమాశ్వాసితుండై రాఘవుం డేగతిం బదాతి యయ్యె, సీత యేమి యనియె, సౌమిత్రి యెట్లు మెలంగె నని చిప్పిల్లు కన్నీళ్ల నడరు గద్గదిక నడుగ మగుడ నడుగులకు నెరఁగి యిట్లనియె.

73


క.

నీరథమునకుం బౌరమ, నోరథమునకున్ భవత్తనుజు లెడలిరి మీ
న్నేరవ్వలిదరి వని దా, వారికులై రావిదేహవరసుత కధిపా.

74


మ.

కటువై తోఁచుదురుక్తు లేమిటికి వక్కాణింతు వైరించియం
తటి బ్రహ్మర్షి మరుద్గవీనవపయోధారాభిషేకంబు స