పుట:Chanpuramayanam018866mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

చంపూరామాయణము


గీ.

అనెడు పతిజంకెనఁ గరంగదయ్యె నకట, మందరాక్రాంత మగుకైకమానసంబు
పూర్ణచంద్రోదయం బయ్యు భూరివీరు, దావరణ మొందుశశికాంతమనఁగనంత.

29


మ.

పతి యాదుర్మతికిం బరాఙ్ముఖత దోఁపం గొంతసే పూరకుం
డి తనుంబిల్వ సుమంతు నంప నటకు న్సీతేశుఁ డేతెంచి యా
నతుఁడై ముందట నిల్చి రా జపుడు దీనస్వాంతుఁడై వర్తిలం
గత మేమీ యని భీతినొందఁ బలి కెం గైకేయి నిర్లజ్జయై.

30


కైక రామునకుఁ దనవరములం జెప్పుట

మ.

తనయాసక్తియు సత్యసూక్తియు విరోధంబొందఁ జింతాంబుధిన్
మునుఁగం జొచ్చె నరేంద్రుఁ డీదొర ననిన్ మున్నొక్కచోఁ గాచి కై
కొనియుందు వరయుగ్మ మే నదియు నీకున్ మాండవీజానికిన్
వనచారావనిభారహేతు వన నైక్ష్వాకుం డనుం బ్రీతుఁడై.

31


మ.

భరతుం డేమి తలంకునో మహిభరింపన్ రాముఁ డుగ్రాటవిన్
జరియింపన్ మదిఁగొంకునో సగరవంశస్వామికిన్ దండ్రి కీ
సరణిం జింతిల నేటికిం దనప్రతిజ్ఞాపూర్తి మావంక దు
ష్కరమై తోఁపఁగ వాసవోపకృతియో గంగాసమానీతియో.

32


చ.

నను వని గాత్రమాత్రభరణంబునకున్ నియమించి యాచతు
ర్వననిధిమేదినీభరణరాజ్యరమాగరిమంబుఁ దమ్ముగు
ఱ్ఱనితల కెత్తినావు సుకరత్వము దీన గణింప నాపయిం
గనఁబడుఁ బక్షపాత మధికంబయి నీమది కంబుజేక్షణా.

33


గీ.

జనకుఁ డనుజాభిషేచననోత్సవశుభంబు, వీనులకు విందుగాఁ దానె యానతిచ్చి
మామకీనాంజలియుతప్రణామపూర్ణ, పాత్రమున కేల కాఁడమ్మ పాత్రమనఁగ.

34


చ.

కులిశనిపాతభీత మగుకొండవిధాన దవానలావళిం
దలఁకువనీవనస్పతివిధంబు దివస్పతిరాజధానికిన్
దొలఁగు యయాతితండ్రిగతి దోఁపఁగ భూపతి నేలవ్రాల ని
హ్వలపడఁబోక కైకగురునానతిఁ జేకొనుమయ్య రాఘవా.

35


క.

అన దండమిడి తదాజ్ఞన్, ననదండగతిన్ శిరంబునం దాల్చి ధరా
వనమునకై రఘువీరుఁడు, వనమున చనుకడంక వర్తిలె నంతన్.

36


క.

మనుజేశునగరు వెలువడి, జననిగృహంబునకు నరిగి సవినయనతుఁడై
పినతల్లిచేఁతఁ దెలిపిన, విని యాకౌసల్య శోకవిహ్వలమతి యై.

37