పుట:Chanpuramayanam018866mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

61


గీ.

జయమానస్థిరాకీర్తిజాయ మాన, వేమి నీసుతుఁడా రాజ్య మేలు మేలు
కౌతుకముఁ బన్ని తిలకు నకౌతుకముగఁ, గౌతుకము [1]*రాము వెడలని కౌతుకంబు.

23


క.

అపరీతరామ మగుతఱి, విపరీతము గాకపోదు విధికృత మగునీ
యుపయమవైభవ మిపుడా, యుపయమవైభవ మొనర్పనున్నది యనుడున్.

24


చ.

అతివ నిరర్గళస్మితవదానన యై కితవాత్మనీన వాం
ఛితవరపూర్తికిం బతివశీకృతిఁ బూన్చుచు నమ్మచెల్ల యా
శ్రుతము నిరాకరించుటకుఁ జూచెద వేమనవచ్చు నింక ని
శ్రుతము వివేకపాకమును సూనృతమున్ మనువంశవల్లభా.

25


మ.

తనమే మాంసము గోసియిచ్చిన కపోతత్రాణశీలిన్ శిబిన్
వినవో యాశ్రితవిప్రశేఖరునకున్ నేత్రప్రదుం డైనధ
న్యు నలర్కాహ్వయు నాలకింపవొ వదాన్యుల్ దప్పిరే బాస ద
ప్పినఁ బాథోలిపిఁ జేసె దుక్తికృతమున్ బృథ్వీశు లూహింతురే.

26


మ.

అకటా యాడినమాట చెల్లుబడి సేయంజూడు మారీతిఁ జ
ల్పక కౌసల్యమనోరథంబె ఘటియింపం బూనినం దాళుకో
నె కదా నే నిఁక దారుణాగ్నిశిఖఁ గానీ నీటఁ గానీ కృపా
ణికఁ గానీ గరళంబుచే నయినఁ గానీ ప్రాణ మొప్పించెదన్.

27


ఉ.

నావిని యీవినాదయవు నాదయితామణివా భవాదృశ
గ్రావకఠోర యేకరణి గణ్య యగున్ సతులందు రాముఁ డే
కైవడి నోఁచుఁ దండ్రి గలుగన్ సుతవంతులపోఁడి మింక మా
కేవిధి నబ్బు నీతనయుఁ డిచ్చు నివాపనివాపమున్ గొనన్.

28


సీ.

మణిమయప్రాసాదమహి మెలంగుపదంబు లడవుల నడచిన నడచుఁగాక
మడుఁగు దువ్వలువఁ బూనెడుకటీరంబు వల్కలశాటిఁ గట్టినఁ గట్టుఁగాక
కుంకుమవాసనాలంకృతం బగుఱొమ్ము బూది పైఁబూసినఁ బూయుఁగాక
పసిఁడితాయెతుకుఁ బాల్పడుమౌళిబంధంబు జడలుగాఁ జాలినఁ జాలుఁగాక


గీ.

కైక యేవీఁకఁ బవళించు లేకలేక
కలిగిన కకుత్స్థవంశశేఖరునిమృదుల
తనువయోయీసు నెనయు నీమనసుకంటె
గడుసుఁదన మొందు నుపలసంఘములయందు.

29
  1. రాము వెడలిన కౌతుకంబు అని యుండఁదగును.