పుట:Chanpuramayanam018866mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

63

రాముఁ డడవికిఁ బైనమగుట

చ.

ధర జలజాదిచిహ్నములు దావుకొనంగ జగత్రయీశివం
కర మగునీకరంబునకుఁ గంకణ మార్తినిదానకాననాం
తరతరుమూల కందఖననం బొనరింపు మటంచుఁ గట్టెనో
గురుఁ డగుశక్తితండ్రి రఘుకుంజర నిన్నటియుత్సవోన్నతిన్.

38


వ.

అని యిత్తెఱుంగున నమ్మత్తకాశినీరత్నంబు చిత్తంబు శోకాయత్తంబుగా వర్తిల్ల నత్తఱి సుమిత్రానందనుం డమిత్రానందకుధరబృందసంక్రందనుం డగుదశస్యందనాగ్రనందనుని తాలిమి యనెడు తూలంబున రవుల్కొనిన కోపశిఖి యాటోపంబు సూప నిట్లనియె.

39


చ.

కలితవివేకపాక యగు కైక నయేతరవావదూకయై
తలఁచిన లోకనింద్యతకుఁ దా నవుఁ గాదన లేక యాకె మం
దులు తల కెక్కి బుద్ధిచలితుం డగువృద్ధుఁడు పెక్కు సేయు మొ
క్కలివగఁ బైన మయ్యెదవు కానకు భానుకులీనశేఖరా.

40


చ.

ముది మది దప్పియున్న యతీమూర్ఖునకు న్నిజ మేది? నిన్ననే
కద నినుఁ బట్ట ముర్వరకుఁ గట్టెద నన్నది యందు కింతి దన్
గదిమికొనం దలంకినది కన్నది విన్నది గాని దేమి చె
ప్పుదు నీది నీతిగాఁ దలఁచుపూనిక నీది గణింపఁ జెల్లదే.

41


చ.

అడగకమున్న నీకు నిఖిలావని తండ్రి యొసంగి యుండఁ ద్రొ
క్కడపడనేటి కుర్వరకుఁగా దొర కాశ్రమవర్ణరక్షలం
బడయుపదంబు లెంతటితపంబున లేవటుగాన దైవ మె
క్కడ వసియించుఁ బౌరుషము గల్గినచోఁ బురుషార్థసిద్ధికిన్.

42


మ.

అరుణత్వంబు వహింప నేమిటికి నీ యంఘ్రుల్ వనాటాట్య మ
త్కరయుగ్మంబు భజించుఁగావుత గుణాకర్షంబుచే రక్తిమన్
వరభీతుం డగుతండ్రి యానతి నతిన్వర్తింప నీ కేటికి
న్భరియింపం జనుఁగాక నాధను విఁకన్ నమ్రత్వ మోరాఘవా.

43


వ.

అని పలుకు ననుజు నలుకయుం గలంకయుం డోలంగ సాంత్వవాదమాధురీరచితసీధుసాధురీతిలాఘవుం డగుచు రాఘవుం డి ట్లనియె.

44


మ.

జనకాదేశము భానువంశజుల కాచార్యం బగుం దండ్రిపం
పున ము న్కండుఁడు రేణుకాతనయుఁడుం బూరుండు గోహత్యకున్