146
చంపూరామాయణము
గీ. | అతివతో నిట్లు ముచ్చట లాడికొనుచు, దండనిలిచినయినజు కైదండఁ బూని | 159 |
చ. | ముదము దలిర్పఁ బాదుకలు ముందఱ నుంచి కడు న్వినీతుఁడై | 160 |
గీ. | ఆర్యసమ్మతసుఖదుఃఖుఁ డైనలక్ష్మ | 161 |
వ. | అంత భరతుండును బురతోభివాదితపూర్వజోపలాలననిఘ్నుం డగుశత్రుఘ్నుండునుం దానును జనకనందనకుఁ బ్రణామం బొనర్చి యవరోధవధూసమేతు లగుసుగ్రీవదశగ్రీవానుజాదిరాజ్యాధిపతుల యధోచితోపచారవిధుల సంతోషితస్వాంతులం జేసి యామంత్రితమంత్రిలోకుండును నాలోకనానుగృహీతపౌరవర్గుండును నగునగ్రజన్ముని నిజావసథంబుఁ జేర్చె నందు. | 162 |
సీ. | రమణీయసుగుణాభిరాముఁ డౌరాముండు జానకీసౌమిత్రిసహితుఁ డగుచు | |
గీ. | కందళితలైన వారిచేఁ గలశజలధి | 163 |
శ్రీరామపట్టాభిషేకము
ఉ. | బంధుర తేజుఁ డజ్జలజబంధుతనూజుఁడు పంప దైత్యని | 164 |