శ్రీ
చంపూరామాయణము
సప్తమాశ్వాసము
సుందరకాండము
క. | శ్రీకర విధ్యండసరో, జాకర వర్ధిష్ణుకీర్తిహంసత్రోటీ | 1 |
ఉ. | చారణమార్గసీమను నిశాచరనాయకనీత యైనసీ | 2 |
హనుమంతుఁడు సముద్రముం దాఁటుట
వ. | అప్పు డప్పుడమితా ల్పనల్పకల్లోలినీవల్లభసముల్లంఘనదృఢతరనిహితహనుమచ్చరణతలపీడనంబు సైరింపంగ నక్షమం బై, నిశ్శేషనిస్సరన్నిర్ఝరౌఘం బగుట నిరంతరనిష్పతద్భాష్పవర్షంబునుంబలె, నితస్తతోవితతజీమూతజాతం బగుటఁ బారిప్లవశిథిలధమ్మిల్లంబునుంబలె, సంత్రాసపుంజితకుంజరయూథం బగుట సంజాతశ్వయథుకంబునుంబలె, సాధ్వసధావమానహరిణగణఖరతరఖురకోటిపాటనోద్ధూతధాతుధూళీపాళీపాటలీతవికటకటకం బగుటఁ బ్రక్షరితశోణితంబునుంబలెఁ, దత్క్షణప్రబుద్ధకంఠీరవకంఠకహకహారాపముఖరితకందరం బగుటఁ గృతాక్రందనంబునుంబలెఁ, బరిసరగహ్వరనిబిడనిస్సరత్సరీసృపం బగుట నిర్గళితాంత్రమూలంబునుంబలెఁ, బ్రస్ఫరితతటోపలపతనదళితకీచకసుషిరసమ్మూర్ఛత్పవనపూరపూరితగగనం బగుటఁ భ్రవర్ధమానోర్ధ్వశ్వాసంబునుంబలె, వాగగోచరం బైనదుర్దశావిశేషంబు నొందె నయ్యెడ. | 3 |
ఉ. | కేసరిసూనువెంబడిని ఖేచరపద్ధతి నుద్గమించి యెం | 4 |