మార్పు:— ఇట మూలమును బెంచి కాని తగ్గించి కాని మఱింత మెఱుంగు గూర్చిన మార్పులను దెలిపెదము.
మూ. | సీతా పురా గగనచారిభి ర ప్యదృష్టా | (అయోధ్యా) |
తె. మ. | అజరాదుల్ పొడగాంచఁగూడని యసూర్యంపశ్య నారాముదే | (4ఆ. 52ప.) |
మూలమునందుంబోలెఁ దెనుఁగున గగనచారులకును బొడగాంచరనిదని సీతకు వనవాసానర్హతను దెలుపుటకై పరమసౌభాగ్యప్రయుక్త మగుసౌకుమార్యాతిశయము చెప్పుటయే కాక యెక్కువగా 'అసూర్యంపశ్య' యనియుఁ జెప్పి యెండ కన్నెఱుంగనిది యడవి కెట్లు పోజాలు నని సందర్భోచిత మగుకరుణరసమును మూలముకంటె మిక్కుటముగా నిందుఁ గవి వెలివిరియించినాఁడు. రామునిదేవిని మనుష్యులు చూడ ననువుగాకుండునట్లు చేసినవిధాతకు రామునియం దింతయభిమానమేల యని యాశంక కల్పించికొని బ్రహ్మకును రామునితాతకునుగల "యజాహ్వయ"మే హేతువుగా నిబంధించి మూలమున కెంతో మెఱుఁగు గావించినాఁడు.
మూ. | యద్యస్తి కౌతుక మపూర్వమృగే మృగాక్షి | (ఆరణ్య) |
తె.శా. | నీకున్ వింతమృగంబుపైని దమియుం టే నేమి కాదంటినా | (5ఆ. 81ప.) |
మూలమందలి 'చాన్ద్రంహరిణ'మ్మునకంటెఁ దెనుంగునందలి 'రాకాచంద్రున కంతరంగ మగుసారంగ' మనుట మిక్కిలిసొంపు. మూలమునఁ జంద్రుఁడు మృగాం