పుట:Chandrika-Parinayamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోగించుటలోఁ బ్రాకరణికప్రయోజన మంతగొప్పగా లేకున్నను, పాండిత్యశౌండీర్యము మాత్రము విశేషముగా గోచరించుచున్నది. ఇవార్థకపర్యాయపదముల నన్నింటిని ఉపయోగించెను.

అరుదైన ప్రయోగములు:

1. చక్కెరవిల్తుజగడంబు=సంభోగము

2. పూవిలుగలవేల్పురాసివము=మన్మథావేశము

3. తుమ్మెద కమ్మగట్టుమూఁకలు=తుమ్మెదల కమ్మకట్టు సేనలు. కమ్మకట్టుసేన లనఁగా వ్రాసుకొన్న యొడంబడిక ప్రకారము రాజునకు సహాయ్యము చేయునట్టి సేనావిశేషము (కమ్మ+కట్టు=కమ్మగట్టు). సూర్యరాయాంధ్రనిఘంటువు ‘కమ్మకట్టు’ శబ్దముక్రింద నిచ్చిన యుదాహరణములు మూడింటిలో నీచంద్రికాపరిణయమునందలి ‘చెలువగు మైత్రిఁ గోయిలవజీరులఁ దుమ్మెదకమ్మగట్టుమూఁకల, గొరువంకరాదొరల, గాటపుఁజిల్కలకాల్బలంబులన్’ ఇత్యాది ద్వితీయాశ్వాసమునందలి 75వ పద్యమును జేర్చుట గమనింపఁదగినది.

4. నల్లపజ=కోయిలల మూఁక, కిరాతసంఘము (నల్లప్రజ) రూపాంతరము. సూర్యరాయాంధ్రనిఘంటువు ‘కలరవ మూన్చు నల్లపజ కప్పుకరా వెనువెంట రాజమండలి నడతేరఁ జైత్రబలనాథునిఁ గూడి’ మొదలగు చంద్రికాపరిణయ చతుర్థాశ్వాసమునందలి 85వ పద్యమును పై యుభయార్థములకు నుదాహరణముగా నిచ్చినది.

5. తాతస్తలోకవాగమృతసంభూతిన్ – తాతస్తత=అక్కడక్కడనుండి వచ్చిన, లోకవాగమృత సంభూతిన్=జనుల యొక్క అమృతవాక్కులవలన అని యర్థము. ఇచ్చటి ‘తాతస్తత’ శబ్దప్రయోగము పాండిత్యస్ఫోరకము. ‘తత ఆగతః, అని అణ్ ప్రత్య