పుట:Chandrika-Parinayamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. వలజాలోకలలామ=సౌందర్యవతులలో శ్రేష్ఠురాలా!

10. దృష్ట్యలేహ్యవలగ్నామణి=కంటికిఁ గనఁబడని మధ్యభాగము గల స్త్రీలలో నుత్తమురాలా!

11. బలభిన్నీలసహోదరచ్చికుర=ఇంద్రనీలములకు సమానములగు కురులు గలదానా!

12. సారసజ్ఞాతినయన=కమలములవంటి కన్నులు గలదానా!

13. అంబురుహమ్మన్యముఖీమచర్చిక=తమ ముఖము కమలమువలె నున్నదని తలఁచు స్త్రీలలో నుత్తమురాలా! ‘ అంబురుహ మాత్మానం మన్యతి ఇతి అంబురహం మన్యం ముఖం యస్యా స్సా అంబురుహమ్మన్యముఖీ’ యని విగ్రహము.

14. కుందరదాలలామ=మల్లెమొగ్గలవంటి పలువరుస గలవారిలో శ్రేష్ఠురాలా! రదనము, రదము పర్యాయపదములు.

15. వాసవనీలకుంతలా=ఇంద్రనీలమణులవంటి కురులు గలదానా!

16. పక్ష్మలనేత్రామణి=దట్టమైన ఱెప్పలవెంట్రుకలుగల కన్నులతో నుండువారిలో నుత్తమురాలా!

17. అబ్జపత్రబాంధవన్నేత్ర=కమలదళములతోఁ జుట్టరికము చేయుచున్న కన్నులు గలదానా!

18. బింబవిమతోష్ఠి=దొండపండునకు విరోధి యగు మోవి గలదానా!

19. అమరేశాశ్మవిజేతృకుంతల=ఇంద్రనీలమణులను జయించు ముంగురులు గలది.

సామాన్యముగా నితరకవు లుపయోగించు కమలనయన, పంకజముఖీ, పద్మగంధి మొదలగువానితో పాటు పైవిధములగు సంబోధన లుప