పుట:Chandragupta-Chakravarti.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11]

ఏడవ ప్రకరణము

81


ప్రతి ఏనుఁగుపై మావటివాఁడు గాక ముగ్గురు యుద్ధభటు లెక్కుచుండిరి. కాన 9,000 గజములనఁగా 36,000 భటులని యర్థము. ఇట్లు వీరినందఱను లెక్క వేయఁగా రమారమి ఏడు లక్షల బలమగుచున్నది.

ఇంతగొప్ప స్కంధావారమున వ్యవస్థకల్పించి, ఒక్కొక్కరికి వారివారి పనుల నిర్ణయించి యేవేళ నే సందర్భము వాటిల్లిన నద్దాని కనువగు తెఱుంగున బలంబుల నడిపి వ్యూహచమత్కారంబుల గనుపఱచి చంద్రగుప్తుఁడు విజయంబుఁగొనియె.

సైన్యవ్యవస్థకయి యీచక్రవర్తి ముప్పది యధికారుల సంఘమేర్పఱచి దానిని గూడ నాఱు పంచాయతులుగ విభజించె. మొదటి పంచాయతిలోని యధికారులు సముద్ర సైన్యమునకును, రెండవ పంచాయతి వారు రస్తుసామగ్రికిని ప్రయాణ ప్రయత్నములకును, సైన్యమునకుఁ గావలసిన తృణకాష్ఠాదులను సంపాదించుటకును, మూడవ పంచాయతి వారు కాల్బలమునకును, నాల్గవవారు. రథసైన్యంబులకును, ఐదవవారు అశ్వసైన్యములకును, ఆఱవవారు ఏనుంగులకును నధికారులై, యుండిరి. 1[1]

సముద్ర సైన్యము

ఈ చక్రవర్తివద్ద సముద్ర సైన్యముండినటుల మెగస్తనీసు వ్రాతల వలనఁ దెలియుచున్నది. కాని ఆ సైన్యమును గురించిన విశేషము లెఱుంగుటకు సాధనములు గానవచ్చుట లేదు.

  1. 1. మెగ స్తనీసు.