పుట:Chandragupta-Chakravarti.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

సైన్య వ్యవస్థ.

క్రీ. పూ. నాలుగవ శతాబ్దమున నుండిన ఈ ప్రథమ చక్రవర్తి కాలముననే మన ఇరువదియవ శతాబ్దమునందలి రాజ్యాంగ నిర్మాణమును బోలిన విశేష రాజ్యాంగ నిర్మాణముండెను. ఒక్కొక్క.యంగమును వర్ణించుట కొక్కొక్క ప్రకరణమయినం జాలదు. ప్రతిభాశాలియగు చంద్రగుప్త చక్రవర్తియు మంత్రాలోచనా ధురీణుండగు చాణక్యుఁడును పన్నిన రాజ్యాంగముల స్వరూపముసు మాచే నయినంత సంక్షిప్తముగ నిటఁబొందుపఱచెదము.

విస్తీర్ణమున ప్రస్తుతపు భరత ఖండమునకంటే నెక్కుడగు భూభాగమును చంద్రగుప్తునకు సంపాదించి పెట్టిన సైన్యపు సంఖ్య యపరిమితముగా నుండెనని గ్రీకు చరిత్రకారులు వ్రాసి యున్నారు, ఆ రాజపుంగవునికడ నాఱులక్షల పదాతులును, 30,000 అశ్వికులును 9000 ఏనుఁగులును, 8000 యరదంబులును, ఉండెనని తెలియుచున్నది.

సారథిగాక ప్రతిరథముమీదను ఇద్దఱు రథికులుందురు, అందుచే 8000 భటులనఁగా 24,000 రథికులని యర్థము,