పుట:Chandragupta-Chakravarti.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

చంద్రగుప్త చక్రవర్తి


తోను నొప్పి ముద్దులొలుక నలంకరించిన రాజపీఠములును, ఫలకములును, రత్నఖచితములైన రాగిపాత్రములును, అతి సుందరములైన చిత్రవస్త్ర సంచయములును కాన వచ్చు చుండెను. ఇచ్చట రాజు సంపూర్ణ శోభనముతో నైమిత్తిక వైభవ కార్యముల నాచరించును. అట్టి యుత్సవకాలముల నతఁడు ముత్యపు కుచ్చులతో నలంకరించిన బంగారుపాలకి నెక్కి స్వర్ణ మయములైన పట్టు పచ్చడములును, సొగసుబట్టలును ధరించి సవారిపోవుచుండు. చిన్న సవారుల కాలముల, రాజు అశ్వారూఢుడైయును పెద్దసవారులప్పుడు గజారూడుఁడైయును వెడలు సమయముల ఇయ్యవి బంగారు సజ్జలతో నొప్పుచుండును. మఱియు నిట్టిసమయములందు ఎడ్లు, పొట్టేళ్లు ఏనుఁగులు, గండకములు మొదలగు మృగముల పందెములను మల్లుల పోట్లాటలును రాజు మిక్కిలి యుత్సుకముతో విలోకించును. ఇందలి ఎడ్లపందెములు మాత్ర మిప్పుడు జరగు టరుదు. తక్కినవి హిందూ రాజధానులలో నేఁటికిని వాడుకలో నున్నవి. ఇంతేకాక రధములకు నడుమ గుఱ్ఱమును దానికి ఇరువైపుల నెడ్లను పూన్చి పరుగునర దూరపు పందెములు పరిగింతురఁట.

నగరముయొక్క నిర్మాణము విస్పష్టముగఁ దెలియఁ జూలము. కాని ఉన్నతములైన గోడలు, అలంగములు, ముట్టు గోడలు, కాపు గోపురములు, బురుజులు, మహాద్వారములు, అగడ్తలును నిస్సంశయముగనుండె. రాజు సాయంతన విహారము సేయునపు డతనిని పౌరులు చూచుటకై మందిరము