పుట:Chandragupta-Chakravarti.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

75


రాజ ప్రాసాదము మ్రాకుతోఁ గట్టఁబడి, పారసీక రాజభవనములగు స్యూసా, ఎక్బటానాలకంటె మిక్కిలి వైభవముతో విలసిల్లుచుండె. దాని స్తంభములు స్వర్ణఖచితములై బంగారు గాలిటెక్కముల తోను, వెండి పిట్టలతోను అలంకరింపఁబడి యుండె. ఈ భవనము అనేక కట్టడములుగ విభజింపఁబడి, అన్నియు . నొక విశాలమును మనోహరమునైన యారామము నందు నిర్మింపఁబడియుండె. ఇందు తళుకుతళుకుమని మెఱయుచున్న మత్స్య పల్వలమును, పెక్కు తెగల శృంగార వృక్షములును పొదరిండ్లును పిక్కటిల్లె. ఇందలి కట్టడములలో కొన్ని రాజ కార్యశాలలు, కొన్ని పరివారనివాసములు, కొన్ని రాజస్త్రీల యంతఃపురములు, ఇంతేకాక సప్తభూమికా ప్రాసాదమును, సహస్రస్తంభ మండపమును, ద్యూతశాలయు, ఉష్ణ స్నానవాటికయు నుండెనఁట. ద్యూతశాలలో గెలుపులయందొక యంశము రాజస్వమ్ముగా జేరెనని ఉపస్తంబ వచనము, స్నానశాలయందు మొదట ప్రవేశాగారమును, పిదప ఉష్ణ గృహమును, అటుపై స్నాన పల్వలమును పొసఁగి, మధ్యమున అగ్నికుండమును చుట్టును ఆసనములు నుండును. సాధారణ స్నానమునకై వాపీ తటాకము లుపయోగింపఁ బడుచుండును. వీనికి ఱాతిపడికట్లును ఆ పడికట్లపై పుష్పాది శిల్పాలంకారములును అమరియుండును

రాజ సభామంటపము అత్యంతాలంకారా డంబరముల నొప్పియుండె. ఆరడుగుల వెడల్పుగల బంగారు పళ్లెములును గిన్నెలును, బలుసొగసు వలువలతోడను, విలువయైన మెత్తల