పుట:Chandragupta-Chakravarti.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

77


లుచితరీతిని కిటికీలు గలవై యుండెను.*[1] నలువైపుల నిండ్లతో నమరిన చతుశ్శాల (Square) లును పెక్కులుండెను.

సామాన్యముగ రాతికట్టడములే లేవు. పునాదులు, కంబములు, పడికట్లును దప్ప తక్కి నవెల్ల మ్రాఁకు కట్టడములు నిటిక కట్టడములునుగ నుండెను. వెలుపలను లోపలను గచ్చు పూసి పువ్వులు, బొమ్మలు, దండపని, తీగపని, సన్నని బొందుపని, రాక్షసపుపని, మున్నగునవి యొప్పునట్లు దేదీప్యముగ రంగులుదీర్చి యుండెను.

గ్రామరక్షక సంఘము.

ఇట్టి రాజధానిని రాజ మందిరంబును గాపాడుటకు ముప్పది యుద్యోగస్తుల సంఘ మొకటి యేర్పరుపఁ బడియెను. ఇది యప్పటి మునిసిపాలిటి యనవచ్చును. ఇందుండు ముప్పది మందియు నాఱు పంచాయితులుగా విభజింపఁబడిరి. ఒక్కొక పంచాయితిలో నైదుగు రుద్యోగస్తులుండిరి. అందు మొదటి పంచాయితీవారు పట్టణములోని కలాకౌశల్యాభివృద్ధికి నుత్తర వాదులయి యుండిరి. అనఁగా నిప్పుడు మన దేశాభిమానులు కొందఱు చేయుచున్న స్వదేశోద్యమము వంటి యుద్యమ మీ

  1. *కవికులగురు కాళిదాసకృతమైన రఘువంశముయొక్క యాఱవసర్గములో 24 వ శ్లోకమునందు పాటలిపురమును గుఱించి "ప్రాసాదవాతాయన సంశ్రితా నాంనేత్రోత్సవం పుష్పపురాంగనానాం" అనఁగా "మేడలలోని కిటికీలను ఆశ్రయించియున్నట్టి పుష్పపురమందలి స్త్రీలకు నేత్రోత్సవము" అని వర్ణింపఁబడుట చూడఁగా ఉత్సవాదులు చూచుటకై యిండ్లకు గవాక్షముల నుంచుచుండిరనుట స్పష్టము.