పుట:Chandragupta-Chakravarti.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7]

నాలుగవ ప్రకరణము

49

ఇట్టివగు ఈ చరిత్రాంశములే మన హిందూదేశపు చరిత్ర వృత్తాంతముల కాలనిర్ణయములను గూర్చుటకు ఆధారములాయెను. భారతీయుల నాగరికతయు, చరిత్రయు శ్రుతి స్మృతి పురాణేతిహాసముల మూలమున దొఱకగల యట్టివి అత్యంత ప్రాచీనములును 5000, 10,000, 20,000 మొదలు గాగల సంవత్సరముల భూతకాల వ్యాప్తములయినను, కాలనిర్ణయ పట్టికా రూపమున పేర్చి వ్రాయనందునను, అద్భుత విచిత్రములను అతిశయోక్తులుగ కలిపిరచించినందునను చరిత్ర దృష్టికి నవి అవిశ్వసనీయములయి యున్నవి. కావున మనదేశపు గత 2500 సంవత్సరముల వృత్తాంతముల పట్టికకు ఈ మెగాస్తనీసుని దినచర్య సమస్త చరిత్ర కారకులకును అనివార్యమైన , యాధారముగ నున్నది. ఈతఁడు సాండ్రొకోట్టను, " అని పేర్కొని యుండు నామము మొదట అనర్ధ నామముగనే యుండెనుగాని, చంద్రగుప్త పదము ఆ గ్రీకుని నోట నట్లు మాఱినదని సరు విల్లియమ్ జోన్సుఅను నొక పాశ్చాత్య విద్వాంసుఁడు వాఖ్యానమియ్యగనే, అందుండి చరిత్ర జ్ఞానాగ్ని రేగి ఇదమిత్థమ్మని తెలియని హిందూ చరిత్రపు వార్తాంగారము లెల్ల రగులుకొనెను. -

అటువంటి అగ్ని దాయకుఁ డీ మెగాస్తనీసు. అటువంటి అగ్ని యీ చంద్రగుప్త ( సాండ్రొకోటను) నామము. కావున నవనందులను చితియందు దగ్ధమగునట్లు చేసిన యా చంద్రగుప్తుని పేరు, ఈ భరతక్షితి దిగంతములకు వ్యాపించిన ప్రథమ చక్రవర్తి యశో౽గ్నిగను, భారతచరిత్రాంధకారమును కొంత