పుట:Chandragupta-Chakravarti.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

చంద్రగుప్త చక్రవర్తి


మట్టునకైన తొలఁగించుచు, పురాణాతిశయోక్తి గహనంబును భస్మీకరించునట్టి దావానలంబుగను ప్రజ్వరిల్లుచున్నది.

చంద్రగుప్తుడు పూర్వమే కోసలరాజ్యమును కబళీకరించి యుండె. అతఁడు స్వయముగ పంజాబును సింధు దేశమును జయించెను. పంజాబులో సైన్యశిథిలత రాఁగనే చెదరువడియున్న సైన్యమంతటిని నాతండు తన మూలబలముగా చేసికొనెను. అనంతరము గుజరాతును జయించి అచ్చట నొక రాజ ప్రతినిధిని నియమించినట్లు రుద్రదాముని శిలాశాసనము నేఁటికిని తెల్పుచున్నది. దీనికి పూర్వమే ఇతఁడు అవంతి అనగా ఉజ్జయినిదేశమును ఆక్రమించి వశపఱచుకొని యుండెను.

ఇమ్మెయిని రాజ్యా రూడుఁడై న చంద్రగుప్తునకు విశ్రాంతికి సమయము దొరికినదిగాదు. వృషలజనన కలంకమునకు విషయభూతుండు. కావునను, ధననందునిచే పరపీడింపఁబడిన ప్రజలపై యధిరూఢుండు కావునను, నందకులాభిమానుల కూటోపజాపములకు లక్ష్యుండు కావునను, ఉన్నత జాతి సంభూత సామంత రాజుల అవజ్ఞా విరోధంబులకును, అలెగ్జాండరు పాశ్చాత్య సేనానాయకుల యభియోగంబునకును ఆస్పదుండు కావునను, స్వయంభారత సర్వస్వ విజయకాంక్షి గావునను, జయింపఁబడిన రాష్ట్రముల సమాధానపఱచి పరిపాలనా సంవిధానములయందు సంస్కారలక్షణ దృష్టినైజము గలవాఁడు గావునను ఒక్కయొడ కూర్చొనుటకుగాని నిలచుటకుగాని తృటికాలము పరుండుటకుగాని వ్యవధిలేక , సదా దుష్టనిగ్రహ శిష్టపరిపాలనమునందే జీవితకాలమంతయు గడప