పుట:Chandragupta-Chakravarti.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

51


వలసినవాఁ డయ్యెను. చారిత్రక విషయముల కవిశ్వసనీయములగు పురాణేతిహాసాది విషయముల నటుండనిచ్చిన భరతఖండ చక్రవర్తులయం దీతఁడే మొదటివాఁడుగఁ గన్పించుచున్నాడు. సేనలు నడుపుట, శత్రువుల నాక్రమించుట, నూతన దేశముల నార్జించుట, న్యాయముల దీర్చుట, నగర పంచాయతులు గ్రామపంచాయతులు నియమించుట, శిల్పముల వృద్ధిపరచుట, విదేశీయుల విచారించుట, జనన మరణముల గణించుట, వ్యాపారముల విమర్శించుట, చేతిపనుల బెంచుట, బాటలు వేయుట, వంతెనలు కట్టుట, ఓడలు నిర్మించుట, రాజపురుషుల నియోగించుట, చారదృష్టి చూచుట, చౌర్యఘాతకాదుల ఖండించుట, పన్నులరాఁబట్టుట, కాలువలు చెరువులు బావులు త్రవ్వించుట, నీళ్లువిడుచుట, నేలకొలుచుట, పంట లెక్కించుట, ద్యూత మద్యాది దుఃఖముల విమర్శించుట, మున్నగు సర్వ రాష్ట్రనిర్వాహ విషయములందును వేగన్నుల చూపుతో జాగ రూకుఁడై , ఆత్మరక్షణార్థము ఆహార, విహార, శయ్యా, ఆసన, భాజన, ఔషధ, బంధు, కళత్ర, మిత్ర, పుత్రాదులనెల్ల అనిమీలిత నయనుఁడై పరిశోధించుచు ఇరువది నాలుగు వత్సరములు రాజ్యమేలెను.

చంద్రగుప్త రాజ్యవిస్తారము

క్రీ. పూ. 322 మొదలుకొని 303 వఱకు అనగా చంద్రగుప్తుఁడు. మొదట గ్రీకువారిని పంజూబు దేశమునుండి వెడలఁగొట్టినది మొదలు శల్యూకస్ నికేతర్ నోడించి అతనితో