పుట:Chandragupta-Chakravarti.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

చంద్రగుప్త చక్రవర్తి


నకు నాతని బంసివేసెను. ఈ మలయకేతు వెవ్వఁడై యుండ నోపు ? ఇతనిచే నడుపఁ బడిన మ్లేచ్ఛయవన కాంభోజూది సైన్యములనఁగ నెవ్వి? ఈ ప్రశ్నలకుఁ బండితులనేకులు పెక్కు రీతుల ప్రత్యుత్తర మిచ్చుచున్నవారు. మలయకేతువు తండ్రి పర్వతరాజని చెప్పఁబడియున్నది. అందుచే నాతఁడు హిమాలయ గిరికందర ప్రాంతమున వసించువాఁడని తోఁచుచున్నది. చంద్రగుప్తుని కిట్లు సాయము చేసిన సైన్యములు గ్రీకు సైన్యములని కొందఱు యూరోపియనుల యభిప్రాయము. కాని గ్రీకు చరిత్రకారు లందఱును చంద్రగుప్తునకు గ్రీకు సైన్యములు సాయముచేసినట్టు వ్రాసియుండనందున పై యభిప్రాయము సరియైనది కాదని కీర్తిశేషులైన కాశీనాథ త్ర్యంబక తెలంగుగారి యభిప్రాయమై యున్నది. పిలిప్పాస్ అను గ్రీకుక్షాత్రపుని హిందువులు చంపిరని కర్ టియస్ మొదలైన గ్రంధకారులు వ్రాసినందున ఈక్షాత్రపుఁడే పర్వతరాజ నామముతో హిందూ గ్రంధములందు వర్ణింపఁబడి యుండ నోఫునని తలంప వచ్చును. తరువాత చంద్రగుప్తునిచే నోడింపఁబడి యాతనితో సంధి చేసి కొనిన శల్యూకస్ అనువాఁడే మలయకేతువైనఁ గావచ్చును. కాని ఇది యిట్లని నిశ్చయముగాఁ జెప్పవీలులేదు. హిమాలయపర్వత సమప్రదేశములందును దరులందును పార్వతీయ జాతులవారనేకు లిప్పటికిని వాసము చేయుచున్నారు. అట్టివారు గొందఱు చంద్రగుప్తునకు సహాయులు వచ్చి యుందురు. అప్పుడా ప్రాంతముల గ్రీకువారును కొందఱుండినందున వారును నీ సైన్యములో చేరినను చేరియుండవచ్చును. .