పుట:Chandragupta-Chakravarti.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము

35


రాక్షసుని వశీకరణము

చందన దాసుఁడను సెట్టి పాటలీపురమున కలఁడు. అతఁడు రాక్షసునకు పరమమిత్రుఁడు. రాక్షసుఁ డూరువిడిచి వెళ్ళినప్పుడు తన భార్యా పుత్రాదుల నీతని యింటనే విడిచి వెళ్లెను. ఈ సంగతి తెలిసికొని చాణక్యుఁడు రాక్షస భార్యా పుత్రాదులను తన స్వాధీనము చేయుమని చందనదాసుని నిర్భంధ పెట్టెను కాని యాతడు మిత్రద్రోహముచేసిన వాడు కాఁడు. అందుకాతనికి నురిశిక్ష విధంపఁబడెను. ఈసమాచారం తెలిసి తనకొఱకై తన మిత్రుఁడు చంపఁబడుట న్యాయము కాదని తలఁచి రాక్షసుఁడు తన ప్రతిస్పర్ధియయిన చాణక్యుని స్వాధీనమయి తనను జంపి తనమిత్రుని విడువ వలసినదనికోరెను. కాని "నీవు చంద్రగుప్తుని మంత్రిత్వము నొప్పుకొనిన యెడల నీ మిత్రుని రక్షించెద ” మని చాణక్యుడు చెప్పగా విధిలేక రాకుసుఁడు అందునకు నొప్పుకొనెను. ఈ సమాచారమంతయు క్రీ. పూ. 322వ సంవత్సర ప్రాంతమున జరిగియుండును. అమాత్యరాక్షసుని సాహాయ్యము వలనను చాణక్యుని మంత్రపు సాయమువలనను చంద్రగుప్తుఁ డరిభంజకుఁడై తనరాజ్యమును భరతఖండమం దంతటను వ్యాపింపఁ జేయుటయేగాక హిమాలయ పర్వతమున కావలనుండు దేశమును గూడ సాధించెను,

చరిత్రాంశములు

రాక్షసుని వశపఱుచుకొనినప్పుడే మలయ కేతువును గూడ వశపఱచుకొని యాతనిచే చంద్రగుప్తునకు సామంత రాజుగా నుండున ట్లొప్పించుకొని చాణక్యుఁ డాతని రాజ్యము