పుట:Chandragupta-Chakravarti.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

గ్రీకువారితో యుద్ధము

చంద్రగుప్తుఁ డసంఖ్యాకములగు సైన్యములఁ గూర్చుకొని యపరిమిత పరాక్రమవంతుఁడై యదివఱకు పంజాబ్ దేశము నాక్రమించియున్న గ్రీకుసైన్యములఁ బూర్తిగ నోడించి వెడలఁగొట్టెను, కాని ఈ కథా భాగమంతయు సవిస్తరముగ వర్ణించుటకుఁ బూర్వము గ్రీకువా రెవరైనది, వీరీ దేశమున కెట్లువచ్చినది. సంగ్రహముగఁ జెప్ప వలసియున్నది.

సింధునది కావలివైపునుండు సులేమాను హాలా పర్వతములు సరిహద్దుగ బ్రారంభమయి వరుసగ పశ్చిమమున ఆప్గనిస్థానము, బెలూచిస్థానము, పరిషియా ( పారసీకము ) ఆసియాలోని తుర్కి, ఐరోపాలోని తుర్కియను దేశనామములచేఁ బిలువంబడు భూభాగమంతయు మన కథాకాలమునఁ బారసీకముగ నుండెడిది. అట్టి పారసీకమునకుఁ బశ్చిమసరిహద్దు మకడోనియా రాజ్యము. ఈ మకడోనియాకు దక్షిణమున గల దేశముగ్రీసు. అక్కడిజనులే గ్రీకులు. ఇట్లు గ్రీకు మకడోనియా దేశములకును హిందూ దేశమునకును మధ్యనుండినది పూర్వ కాలమున నొక్క ఫారసీకమె. ఇందు దక్షిణ సముద్రమునుండి