పుట:Chandragupta-Chakravarti.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

చంద్రగుప్త చక్రవర్తి


ఈ దెబ్బతోడనే ఆన్టిగోనసునకుఁ బశ్చిమమునఁ దొందరలు చూపట్టెను. అయినను వెనుదీయక ఆన్టిగోనసు తనకొమరుని డెమిట్రియసును బేబిలోనియామీఁదికి గొప్పదండుతో నని పెను. ఆ దండు కొల్ల గొట్టుటతప్ప మఱి యేవిధమయిన ఫలమును గొనిరాదయ్యె. సెల్యూకసు మెల్ల మెల్లఁగ ఆన్టిగోనసు పక్షపాతులను పరాజితులఁ జేసి మరల బేబిలోనియాను స్వాధీన పఱచుకొనెను. రెండవమా రితఁడు ఈ నగరమును కైవసము చేసికొనినది మొదలు క్రీ. పూ. 302 వఱకు తొమ్మిది సంవత్సరములకాల మేమిజరిగెనో మన మెఱుంగుట కాధారములు గానరావు. 302 లో సెల్యూకసు లాసిమేకసులకును ఆన్టిగోనసునకును ఇప్సను అను స్థానమున యుద్ధము జరిగెను. అన్టిగోనసు హతుఁడయ్యె. సెల్యూకసునకు పాలెస్టను మొదలు భరతభండమువఱకుఁగల రాజ్యము సర్వస్వాతంత్ర్యములతో నబ్బెను. పాలెస్టను సెల్యూకసునకును ఈజిప్తు క్షత్రపుఁడగు టాలమీకును వివాదకారణమయ్యే. కాని టాలమీ సెల్యూకసునకు కష్ట కాలమున సాయము చేసినవాఁడు గావున నా వివాదము అప్పుడు విగ్రహము కాదయ్యెను.

సెల్యూకసు రాజ్యవిస్తారము పెంపునందిన ఆ 303 వ సంవత్సరముననే అతఁడు భరతవర్షము పయికెత్తివచ్చి చంద్రగుప్తునిచేఁ బరిభవమంది పుత్రికనిచ్చి సంధి చేసికొనెను,

సెల్యూకసు బలవంతుఁ డగుట చూచి తక్కుగల క్షత్రపు లతనిపై విరోధమూనిరి. టాలమీ లాసి మేకసు