పుట:Chandragupta-Chakravarti.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

165


లొక్కండై రి. కొంతకాలము ఆన్టిగోనసు కుమారుఁడు డెమింట్రియసు సెల్యూకసుతోడఁజేరి, కొంతకాల మెదిరించి, కొంత కాలములోఁబడి పలుపాట్లఁబడి క్రీ. పూ. 283 లో విషము పుచ్చుకొని చచ్చెను. అతనితోటి సంబంధములలో సెల్యూకసు ఉదారుఁడుగను, దయార్ద్రహృదయుఁడుగను, ధైర్యశాలిగను గన్పట్టుచున్నాఁడు. డెమిట్రియసు పలుత్రోవలఁ ద్రొక్కి తుట్టతుదకుఁ జిక్కి. సెల్యూకసుచే రాజపురుపోచితమగు చెఱయం దుంచఁబడెను. అప్పుడు లాసిమేక నతనిని జంపిన రెండు వేల టాలెంటులు ఇచ్చెదనని సెల్యూకసునకుఁ దెలియ పఱచెను. దానిపై సెల్యూకసు మండిపడి అట్టి దుష్కార్యము తగదని లాసిమేకసునకు విశదీకరించుచుఁ బ్రత్యుత్తరమిచ్చెను.

ఒకతఱి ప్రజలు కొందఱు డెమిట్రియసు పక్షము వహించియుండిరి. అతనికిఁ గొంచెముగ విజయము కలిగి యుండెను. బలములఁ జేర్చుకొని అతఁడు కొంత యనారోగ్యము దటస్థించినను లెక్క. సేయక పితూరీపోట్లాటలు జరుపు చుండెను. అట్టి సమయమున సెల్యూకసు డాలునొక్కటిని మాత్రము చేతఁబట్టుకొని యొంటరిగా డెమిట్రియసు విడిసి యుండిన యడవిఁజొచ్చి యచ్చటి యుద్ధభటులను దనపక్షమునకు రావలసినదని చీ రెనఁట! ఆహా! ఎంతసాహసము! ఎంత ధైర్యము ! !

ఇంత యాత్మవిశ్వాసము గలవాఁడు గావుననే దైవము గూడ నతనికిఁ దోడయ్యె.